Zinc: ఈ 5 ఆహారాల్లో గుడ్ల కంటే ఎక్కువ జింక్ ఉంటుంది..!
Zinc Rich Foods: జింక్ అనేది మన శరీరానికి ఎంతో అవసరమైన ఖనిజం.
Zinc Rich Foods: జింక్ అనేది మన శరీరానికి ఎంతో అవసరమైన ఖనిజం. ఇది ఇమ్యూనిటీ వ్యవస్థను బలపరుస్తుంది.. అంతే కాదు గాయాలను త్వరగా నయమయ్యేలా చేస్తుంది. గుడ్లలో ఎక్కువ శాతం ప్రోటీన్ ఉంటుంది అదేవిధంగా జింక్ కూడా ఉంటుంది. అయితే గుడ్లు కాకుండా మరో అయిదు ఆహారాల్లో కూడా ఈ జింక్ అధిక మోతాదులో ఉంటుంది.
జింక్ ఉండే ఫుడ్ తీసుకోవాలనుకునే వారికి ఈ ఐదు ఆహారాల్లో పుష్కలంగా ఉంటుంది. గుడ్ల కంటే ఎక్కువ ఆరోగ్యాన్ని ఇస్తాయి. అలాంటి ఐదు ఆహారాల జాబితా ఇదే. వీటిని చేర్చుకోవడం వల్ల మన శరీరానికి కావాల్సిన జింక్ మాత్రమే కాదు ప్రోటీన్, ఐరన్, రాగి కూడా లభిస్తుంది.
గుమ్మడి గింజలు..
గుమ్మడి గింజల్లో కూడా జింకు పుష్కలంగా ఉంటుంది ఈ గింజలను వేయించి తీసుకోవచ్చు అంతే కాదు ఇందులో మెగ్నీషియం ఐరన్ యాంటీ ఆక్సిడెంట్ కూడా పుష్కలంగా ఉంటుంది ఇది ఈవినింగ్ స్నాక్ మాధురి కూడా తీసుకోవచ్చు లేకపోతే తీసుకోవచ్చు గుమ్మడి గింజల్లో జింక్ పుష్కలం
ఆయిస్టార్స్..
ఆయిస్టార్స్‌లో అధిక మోతాదులో జింక్ ఉంటుంది. ఒక చిన్న సర్వింగ్‌లో మీ రోజుకు సరిపడా జింక్ మీ శరీరానికి అందుతుంది. ఇందులో ప్రోటీన్స్, ఖనిజాలు కూడా ఉంటాయి.అయితే, ఎక్కువ మోతాదులో జింక్ అందాలంటే ఆయిస్టార్స్ తినాల్సిందే. ఇది మీ ఇమ్యూనిటీ వ్యవస్థను బలపరుస్తుంది. అంతేకాదు కణాల పనితీరును కూడా మెరుగు చేసే గుణం ఆయిస్టార్స్‌లో ఉంది.
జీడిపప్పు..
జీడిపప్పులో కూడా జింక్ పుష్కలం. ఇందులో మన శరీరానికి కావాల్సిన మెగ్నీషియం, రాగి కూడా ఉంటుంది. జీడిపప్పును నేరుగా తినవచ్చు. వేయించి తీసుకోవచ్చు లేదా ఏదైనా కూరల్లో కూడా కలిపి మన డైట్ లో చేర్చుకోవచ్చు. జీడిపప్పు రుచికరంగా ఉండటమే కాకుండా గుడ్ల కంటే అధిక మోతాదులో జింక్ ఉంటుంది. అంతేకాదు ఈ గింజలు ఆరోగ్యం కూడా.
చీజ్..
చీజ్‌లో కూడా జింక్ ఎక్కువ మోతాదులో ఉంటుంది. వీటిని డైట్‌లో చేర్చుకోవడం మంచిది. ముఖ్యంగా క్యాల్షియం, ప్రోటీన్లు ఉంటాయి. ఇవి ఎముకల ఆరోగ్యానికి మంచిది. అంతే కాదు కండరాల పనితీరును కూడా మెరుగు చేస్తుంది. స్విస్‌చీజ్ స్నాక్ రూపంలో తీసుకోవచ్చు. ఇందులో కూడా గుడ్ల కంటే అధిక మోతాదులో జింక్ కలిగి ఉంటుంది.
శనగలు..
శనగల్లో కూడా జింక్ ఉంటుంది అంతేకాదు ఇందులో ప్రోటీన్, ఫైబర్, విటమిన్స్, మినరల్స్ కూడా ఉంటాయి. వివిధ రకాల వంటలో వినియోగించవచ్చు. ఒక కప్పు శనగల్లో 2.5 మిల్లీగ్రాముల జింక్ ఉంటుంది. గుడ్ల కంటే ఎక్కువ మోతాదులో జింక్ శనగల్లో కలిగి ఉంటుంది.