Diabetic: షుగ‌ర్‌ పేషెంట్ల‌కు ఈ 3 జ్యూస్‌లు దివ్య ఔష‌ధం..!

Diabetic: ఈ రోజు ల్లో షుగర్ వ్యాధి చిన్నా, పెద్దా లేకుండా ప్ర‌తి ఒక్క‌రికీ వ‌స్తోంది

Update: 2021-10-28 13:30 GMT

కాకరకాయ, టమాటా మరియు దోసకాయ జ్యుస్ (ఫైల్ ఇమేజ్)

Diabetic: ఈ రోజు ల్లో షుగర్ వ్యాధి చిన్నా, పెద్దా లేకుండా ప్ర‌తి ఒక్క‌రికీ వ‌స్తోంది. ఈ వ్యాధి మారిన‌ జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా సంభవిస్తుంది. షుగర్‌ని సకాలంలో నియంత్రించక‌పోతే అది పెద్ద వ్యాధిగా అవ‌త‌రిస్తుంది. చక్కెరను నియంత్రించడానికి ఔషధంతో పాటు, ఆహారాన్ని కూడా కంట్రోల్ చేయ‌డం అవ‌స‌రం. షుగర్‌తో బాధపడుతున్న రోగులు ఏదైనా తీపిని తింటే అది వేగంగా పెరుగుతుంది. అయితే షుగ‌ర్‌కి ఈ 3 కూర‌గాయ‌ల జ్యూస్ అద్భుతంగా ప‌నిచేస్తుంది. చక్కెర స్థాయిని వేగంగా నియంత్రిస్తాయి. వాటి గురించి తెలుసుకుందాం.

1. కాకరకాయ రసం

మధుమేహ వ్యాధిగ్రస్తులకు కాకరకాయ దివ్యౌషధం. కాకరకాయలో ఉండే విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ బి గ్రూప్, థయామిన్ , రైబోఫ్లావిన్‌లు మధుమేహాన్ని అదుపులో ఉంచుతాయి. అటువంటి పరిస్థితిలో, షుగర్ పేషెంట్‌కు ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో కాక‌ర రసాన్ని తీసుకుంటే ఉపయోగకరంగా ఉంటుంది.

2. టమోటా రసం

మనం ప్రతిరోజూ దాదాపు ప్రతి వంటకంలో టమోటాలు వాడుతాం. ఇది ఆహారాన్ని రుచిగా చేయడమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఉపయోగపడుతుంది. టొమాటో చక్కెరను తగ్గించడంలో కూడా పనిచేస్తుంది. ఇందులో ఎటుంటి సందేహం లేదు. యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉన్న టొమాటోలలో ఉండే ప్యూరిన్ అనే మూలకం రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో షుగర్ పేషెంట్లకు టొమాటో జ్యూస్ ఇస్తే బాగుంటుంది.

3. దోసకాయ రసం

నీరు, విటమిన్ సి సమృద్ధిగా ఉండే దోసకాయ వంటి కూరగాయలను ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. దోసకాయ తరచుగా డైటింగ్ చేసేవారు ఎక్కువ‌గా తింటారు. అయితే ఇది షుగర్ పేషెంట్లకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. నిజానికి ఇందులో యాంటీఆక్సిడెంట్లు, డైటరీ ఫైబర్, పొటాషియంతో సహా విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. అటువంటి పరిస్థితిలో చక్కెర పెరిగినట్లయితే మీరు దోస‌కాయ జ్యూస్‌ని తీసుకోవ‌చ్చు.

Tags:    

Similar News