Brain Damaging: ఈ అలవాట్లు మీ మెదడుపై ఒత్తిడి పెంచుతాయి..!

Brain Damaging: ఆరోగ్యం గురించి న్యూస్‌ పేపర్లు, వెబ్‌సైట్స్‌, ఛానెల్స్‌లో చర్చ ఉంటుంది. కానీ వాటిలో మెదడు గురించి తక్కువగా చర్చిస్తారు.

Update: 2022-04-23 15:30 GMT

Brain Damaging: ఈ అలవాట్లు మీ మెదడుపై ఒత్తిడి పెంచుతాయి..!

Brain Damaging: ఆరోగ్యం గురించి న్యూస్‌ పేపర్లు, వెబ్‌సైట్స్‌, ఛానెల్స్‌లో చర్చ ఉంటుంది. కానీ వాటిలో మెదడు గురించి తక్కువగా చర్చిస్తారు. ఎందుకంటే దాని గురించి తెలిసింది తక్కువ తెలియంది కొండంత. వాస్తవానికి కొన్ని అలవాట్ల వల్ల మెదడుపై ఒత్తిడి పెరుగుతుంది. అలాంటప్పుడు వాటిని వదిలేయడం ముఖ్యం. 40 ఏళ్లు దాటిన వారిలో ఒత్తిడి హార్మోన్‌ కార్టిసోల్‌ ప్రభావంతో మెదడు కుచించుపోతున్నట్టు గుర్తించారు. ఒత్తిడి హార్మోన్‌ అత్యధికంగా విడుదల కావడం మున్ముందు డిమెన్షియా ముప్పుకు దారితీస్తుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఒత్తిడి ప్రజల ఆలోచనా ధోరణిని కూడా ప్రభావితం చేస్తుందని జర్నల్‌ న్యూరాలజీలో ప్రచురితమైన హార్వర్డ్‌ మెడికల్‌ స్కూల్‌ అథ్యయనం వెల్లడించింది.

1. సరైన నిద్ర లేకపోవడం

మంచి నిద్ర రాకపోవడం వల్ల మీ శరీరం ఖచ్చితంగా అలసిపోయినట్లు అనిపిస్తుంది. అయితే దీని కంటే ఎక్కువగా ఇది మీ మనస్సుపై ప్రభావం చూపుతుంది. పదే పదే నిద్ర లేమి మీ మెదడుపై జ్ఞాపకశక్తిపై తీవ్ర ప్రభావం చూపుతుంది.

2. అధిక ఉప్పు తీసుకోవడం

అధిక ఉప్పు రక్తపోటుకు కారణం అవుతుంది. దీని కారణంగా స్ట్రోక్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఉంటే మెదడు దెబ్బతినే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఇది కాకుండా మీరు శబ్ద కాలుష్యాన్ని కూడా నివారించాలి. మీ చెవులకు వచ్చే అధిక శబ్దం మీ మెదడుపై తీవ్ర ప్రభావం చూపుతుంది.

3. ఒంటరితనం

మీరు మీ సమస్యలన్నింటినీ పంచుకునే వ్యక్తిని కలిగి ఉండాలి. మీ మనసులో చాలా విషయాలు ఉంచుకోవడం వల్ల ఒత్తిడి పెరుగుతుంది. మీరు ఎవరికైనా చెప్పడం ద్వారా దానిని తగ్గించుకోవచ్చు. మీ మనస్సు కూడా ప్రశాంతంగా, రిలాక్స్‌గా ఉంటుంది. అందుకే ఎప్పుడు ఒంటరిగా ఉండకూడదు. 

Tags:    

Similar News