Health Tips: చలికాలంలో మెంతికూర తింటే బోలెడు ప్రయోజనాలు.. తెలిస్తే అస్సలు వదలరు..!

Health Tips: మెంతి ఆకులు శరీరానికి చాలా మేలు చేస్తాయి.

Update: 2022-11-25 09:33 GMT

Health Tips: చలికాలంలో మెంతికూర తింటే బోలెడు ప్రయోజనాలు.. తెలిస్తే అస్సలు వదలరు..!

Health Tips: మెంతి ఆకులు శరీరానికి చాలా మేలు చేస్తాయి. శీతాకాలంలో మెంతి ఆకులను కూరగాయలు, పూరీలు, పప్పులు మొదలైన వాటిలో కలిపి తింటారు. ఇవి ఆహారపు రుచిని పెంచుతాయి. మెంతి ఆకుల్లో క్యాల్షియం, ఐరన్, ప్రొటీన్, ఫాస్పరస్ ఉంటాయి. వీటివల్ల తేలికగా జీర్ణమవుతాయి. మెంతి ఆకులను తినడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఈ రోజు తెలుసుకుందాం.

బరువు తగ్గుతారు..

మెంతి ఆకులు శరీరానికి అనేక ప్రయోజనాలను కల్పిస్తాయి. చలికాలంలో బరువు తగ్గడానికి బాగా ఉపయోగపడుతాయి. ఎందుకంటే మెంతి ఆకుల్లో పీచు ఎక్కువగా ఉంటుంది. ఇది ఎక్కువ సేపు కడుపు నిండిన భావన కలిగిస్తుంది. దీని వల్ల ఆకలిగా అనిపించదు. ఈ విధంగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

చక్కెర నియంత్రణ

మధుమేహ వ్యాధిగ్రస్తులు ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. చలికాలం మధుమేహం ఉన్నవారిలో చక్కెర స్థాయి పెరుగుతుంది. దీన్ని నియంత్రించాలంటే మెంతికూరను ఖచ్చితంగా ఆహారంలో చేర్చుకోవాలి. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుకోవచ్చు.

ఆరోగ్యకరమైన చర్మం

చలికాలంలో చర్మం పగలడం చాలా సాధారణం. మెంతి ఆకులలో యాంటీ-ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మొటిమలను తొలగించడంలో సహాయపడతాయి. మెంతి ఆకులను పేస్ట్ లా చేసి ముఖానికి అప్లై చేయాలి. ఇది ముఖంపై ఉన్న మొటిమలు, మచ్చలని తొలగించడంలో సహాయపడుతుంది.

Tags:    

Similar News