Drinking Water: ఈ సమయాలలో నీరు తాగితే బోలెడు ప్రయోజనాలు.. కానీ చాలామంది వీటిని పట్టించుకోరు..!

Drinking Water: నీరు అనేది మన జీవితంలో చాలా ముఖ్య భాగం. నీరు లేని ప్రపంచాన్ని ఊహించుకోవడం కష్టం.

Update: 2024-02-21 15:00 GMT

Drinking Water: ఈ సమయాలలో నీరు తాగితే బోలెడు ప్రయోజనాలు.. కానీ చాలామంది వీటిని పట్టించుకోరు..!

Drinking Water: నీరు అనేది మన జీవితంలో చాలా ముఖ్య భాగం. నీరు లేని ప్రపంచాన్ని ఊహించుకోవడం కష్టం. మన శరీరంలో డెబ్బై శాతం నీరు మాత్రమే ఉంటుంది. ఆహారం తినకుండా వారం రోజులు బతకచ్చు కానీ నీరు తాగకుండా ఒక్కరోజు ఉండడం కష్టం. కానీ చాలామందికి నీరు తాగే సమయాలు, పద్దతులు తెలియవు. ఇష్టమొచ్చిన విధంగా తాగుతారు. చాలా మంది దాహం వేసినప్పుడు మాత్రమే నీరు తాగుతారు. కానీ వాస్తవానికి శరీరానికి నీటి అవసరం ఒక నిర్దిష్ట సమయం ఉంటుంది. ఆ సమయంలో నీరు తాగితే చాలా ప్రయోజనాలు ఉంటాయి. వాటి గురించి ఈ రోజు తెలుసుకుందాం.

ఉదయం లేవగానే

ఉదయం ఖాళీ కడుపుతో నీరు తాగడం శరీరాన్ని హైడ్రేట్ చేయడానికి ఉత్తమ మార్గం. రాత్రిపూట ఉపవాసం ఉన్న తర్వాత శరీరానికి తక్షణ శక్తి అవసరం. ఈ పరిస్థితిలో నిపుణులు సగం నిమ్మకాయ రసం, 1 టీస్పూన్ నెయ్యి లేదా చిటికెడు దాల్చినచెక్కను నీటిలో వేసి మరిగించి తాగాలని సూచిస్తున్నారు. ఇది యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి, పొటాషియం ప్రయోజనాలను అందిస్తుంది.

ఆహారం తినే ముందు

ఆహారం తినే ముందు నీరు తాగడం వల్ల జిఐ ట్రాక్ట్ క్లియర్ అవుతుందని, బరువు తగ్గించే ప్రయాణంలో మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ప్రతిరోజూ భోజనానికి 30 నిమిషాల ముందు 500 మి.లీ నీరు తాగే వ్యక్తులు 12 వారాల్లో 3 కిలోల బరువు తగ్గినట్లు అధ్యయనంలో తేలింది.

నిద్రపోయే ముందు

నిద్రపోయే ముందు నీరు తాగడం వల్ల రాత్రిపూట శరీరం హైడ్రేట్‌గా ఉంటుంది. టాక్సిన్‌లను ఆటోమేటిక్‌గా బయటకు పంపుతుంది. ఇది కాకుండా నిద్రపోయే ముందు నీరు తాగడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ పెరుగుతుంది. ఇది గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఇది మాత్రమే కాదు కడుపు నొప్పి లేదా తిమ్మిరి నుంచి ఉపశమనాన్ని అందిస్తుంది.

స్నానం చేయడానికి ముందు

స్నానానికి ముందు వేడినీరు తాగడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. వాస్తవానికి స్నానం చేయడానికి ముందు వేడి నీటిని తాగడం వల్ల శరీరాన్ని లోపలి నుంచి వేడి చేస్తుంది. ఇది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఇది కాకుండా చెమట పట్టిన తర్వాత, మసాజ్ చేసిన తర్వాత, ఆవిరి పట్టిన తర్వాత లేదా నీటిని తాగవచ్చు. వ్యాయామానికి ముందు తర్వాత నీరు తాగడం చాలా అవసరం.

Tags:    

Similar News