Heart Attack: గుండె జబ్బులని గుర్తించాలంటే ఈ ఒక్క పరీక్ష చాలు..!

Heart Attack: ప్రపంచంలో గుండెజబ్బులతో బాధపడే వారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతూ వస్తోంది.

Update: 2022-07-30 09:48 GMT

Heart Attack: గుండె జబ్బులని గుర్తించాలంటే ఈ ఒక్క పరీక్ష చాలు..!

Heart Attack: ప్రపంచంలో గుండెజబ్బులతో బాధపడే వారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతూ వస్తోంది. దీనికి కారణం జీవనశైలి గజిబిజిగా మారడం. అంతేకాదు ఆయిల్ ఫుడ్స్ తినే ధోరణి ఎక్కువవడం. దీనివల్ల రక్తంలో చెడు కొలెస్ట్రాల్ పెరుగుదలకు దారితీస్తుంది. ఇది అధిక రక్తపోటుకు కారణమవుతుంది. అందుకే గుండెపోటు, కరోనరీ ఆర్టరీ వ్యాధి, ధమనులు, సిరలలో కొవ్వు పేరుకుపోవడం వంటి గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతోంది.

మీరు గుండెపోటు ప్రమాదాన్ని నివారించాలనుకుంటే ట్రోపోనిన్ టి అనే రక్త పరీక్షను చేయించుకోవాలి. గుండె సంబంధిత వ్యాధులను గుర్తించడానికి ఇది సహాయపడుతుంది. ఇది రక్తంలో ఉన్న ట్రోపోనిన్ స్థాయిని తెలియజేస్తుంది. ట్రోపోనిన్ నిజానికి గుండె కండరాలలో ఉండే ఒక రకమైన ప్రోటీన్. దీని స్థాయి పెరిగితే గుండె కండరాలు దెబ్బతింటాయి. మీకు శరీరంలో కొన్ని ప్రమాదకరమైన లక్షణాలు కనిపిస్తే ఖచ్చితంగా ట్రోపోనిన్ T టెస్ట్ చేయించుకోవాలి.

ఇందులో ముఖ్యంగా ఛాతీ నొప్పి, మైకము, గొంతు నొప్పి, దవడ నొప్పి, విశ్రాంతి లేకపోవడం, అధిక చెమట, వాంతులు, అధిక అలసట వంటివి ఉంటాయి. ఈ లక్షణాలను విస్మరిస్తే మీరు ప్రమాదంలో పడ్డట్లే అని గుర్తుంచుకోండి. ఈ పరిస్థితిలో మీరు ట్రోపోనిన్ టి పరీక్ష చేయించుకుంటే మిమ్మల్ని మీరు రక్షించుకునే అవకాశం ఉంటుంది. ట్రోపోనిన్ టి టెస్ట్ అనేది ఒక రకమైన రక్త పరీక్ష. దీని ద్వారా శరీరంలో సోడియం, క్రియేటినిన్, పొటాషియంలని గుర్తించవచ్చు.

Tags:    

Similar News