Mini Walks : ప్రతి గంటకు 5 నిమిషాలు నడవండి.. ఆఫీస్ పనిలో ఉన్నా ఆరోగ్యంగా ఉండడం ఇలాగే

నడక ఆరోగ్యానికి చాలా మంచిదని మనందరికీ తెలుసు. అయితే, ఆరోగ్య నిపుణులు చెప్పేది ఏమిటంటే.. ప్రతి గంటకు ఒకసారి 5 నిమిషాలు లేచి నడవడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు పొందవచ్చట.

Update: 2025-12-05 08:30 GMT

 Mini Walks : ప్రతి గంటకు 5 నిమిషాలు నడవండి.. ఆఫీస్ పనిలో ఉన్నా ఆరోగ్యంగా ఉండడం ఇలాగే

Mini Walks : నడక ఆరోగ్యానికి చాలా మంచిదని మనందరికీ తెలుసు. అయితే, ఆరోగ్య నిపుణులు చెప్పేది ఏమిటంటే.. ప్రతి గంటకు ఒకసారి 5 నిమిషాలు లేచి నడవడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు పొందవచ్చట. రోజు మొత్తం ఒకే చోట కూర్చుని పనిచేసే వారికి, కాళ్ళ కండరాలు గట్టిపడతాయి. ఇది ఇన్సులిన్ నిరోధకత ఉన్నవారికి మరింత ప్రమాదకరంగా మారుతుంది. అందుకే పనిలో మధ్యమధ్యలో ఈ చిన్న నడకలు అలవాటు చేసుకుంటే మీరు నమ్మలేని ఆరోగ్య లాభాలు మీ సొంతమవుతాయి.

ప్రతి గంటకు 5 నిమిషాలు లేచి నడవడం వల్ల ఈ ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి:

1. రక్త ప్రసరణ మెరుగు : గంటల తరబడి ఒకే చోట కూర్చున్నప్పుడు, మోకాళ్ల కింద రక్తం పేరుకుపోతుంది. దీనివల్ల రక్త ప్రవాహం నెమ్మదిస్తుంది. ప్రతి గంటకు 5 నిమిషాలు లేచి నడవడం ద్వారా, రక్త ప్రవాహం పెరుగుతుంది. ఇది గుండెకు చేరే ఆక్సిజన్ పరిమాణాన్ని కూడా పెంచుతుంది.

2. తక్షణ శక్తి లభిస్తుంది : ఎక్కువ సేపు ఒకే చోట కూర్చునే వారు సోమరితనంగా మారతారు. అంతేకాకుండా, పనిపై దృష్టి పెట్టలేక మనసు చెదిరిపోతుంది. దీనికి ప్రధాన కారణం శారీరక శక్తి తగ్గడం. అందుకే, మధ్యలో ఐదు నిమిషాలు నడవడం వల్ల మనసు రిలాక్స్ అయ్యి, శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది.

3. ఇన్సులిన్ నిరోధానికి పరిష్కారం : మధుమేహం ఉన్నవారికి లేదా మధుమేహం రాకుండా ఉండాలంటే కాళ్ళ కండరాల కదలిక చాలా ముఖ్యం. కండరాల కదలిక ఇన్సులిన్ స్రవించడం, దాని వినియోగాన్ని నియంత్రిస్తుంది. రోజంతా కూర్చున్నప్పుడు రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది. ఈ అలవాటును నివారించడానికి ప్రతి గంటకు ఒకసారి నడిచే అభ్యాసం చాలా ప్రయోజనకరం.

4. కొవ్వును అడ్డుకుంటుంది : పొట్ట కింద ఉబ్బరం ఉన్నవారు, మద్యపానం చేసేవారు, కొలెస్ట్రాల్ సమస్య ఉన్నవారు లేదా రోజంతా ఒకే చోట కూర్చునే వారిలో జీవక్రియ చాలా నెమ్మదిస్తుంది. ఈ జీవక్రియ రేటును పెంచుకోవడానికి ప్రతి గంటకు ఈ చిన్న నడక అలవాటు చేసుకోవడం తప్పనిసరి.

Tags:    

Similar News