Alert: అలర్ట్‌.. మీరు ఎక్కువ సేపు కుర్చీలో కూర్చునే జాబ్‌ చేస్తున్నారా..!

Alert: నిలబడటానికి ఇష్టపడని వ్యక్తులకి ఇది చాలా చేదునిజమని చెప్పవచ్చు.

Update: 2022-06-21 11:00 GMT

Alert: అలర్ట్‌.. మీరు ఎక్కువ సేపు కుర్చీలో కూర్చునే జాబ్‌ చేస్తున్నారా..!

Alert: నిలబడటానికి ఇష్టపడని వ్యక్తులకి ఇది చాలా చేదునిజమని చెప్పవచ్చు. ఎక్కువ సేపు కుర్చీలోకూర్చోవడం వల్ల పెద్ద ముప్పు సంభవిస్తోంది. ఒక అంతర్జాతీయ పరిశోధన అధ్యయనం ప్రకారం.. ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల రకరకాల వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని తేలింది. సైమన్ ఫ్రేజర్ యూనివర్శిటీ చేసిన అంతర్జాతీయ పరిశోధనా అధ్యయనంలో ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇవి వింటే మీరు వెంటనే కుర్చీలో నుంచి లేచి నిలబడతారు.

ప్రపంచంలోని 21 దేశాలకు చెందిన 1,05,677 మందిపై 11 సంవత్సరాల పాటు అధ్యయనం చేసిన తర్వాత ఒక విషయం తేలింది. ఎక్కువ సమయం కూర్చుని గడిపే వ్యక్తులు తొందరగా మరణిస్తున్నట్లు కనుగొన్నారు. సాధారణ వ్యక్తుల కంటే వీరికి గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. పరిశోధనలో పాల్గొన్న వ్యక్తులను అధ్యయనం చేసిన తరువాత రోజుకు 8 లేదా అంతకంటే ఎక్కువ గంటలు కూర్చునే వారి ప్రాణాలకు ఎక్కువ ప్రమాదం ఉందని తేలింది. దీంతో పాటు మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్, స్ట్రోక్ లేదా హార్ట్ ఫెయిల్యూర్ వంటి అనేక గుండె జబ్బులు వచ్చే ప్రమాదం 17% నుంచి 50% వరకు పెరిగింది.

కార్పొరేట్ ప్రపంచంతో సంబంధం ఉన్న చాలా మంది వ్యక్తులు ఇలాంటి వ్యాధుల బారిన పడుతున్నారని తేలింది. మన శరీరం సహజంగా కూర్చోవడానికి వీలులేనిది. ఇలాంటి పరిస్థితుల్లో ఎక్కువసేపు కూర్చోవడం వల్ల చెడు ప్రభావం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. వయసు పెరిగే కొద్దీ కూర్చోవడం వల్ల శరీరంపై చెడు ప్రభావం ఉంటుంది. ఈ సమస్యలు మహిళల్లో కంటే పురుషుల్లోనే ఎక్కువగా ఉంటాయని వైద్యులు చెబుతున్నారు.

Tags:    

Similar News