Expensive Fruits: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పండ్లు.. ఒక్కో పండు ధర రూ. 22 లక్షలు.. అవి ఎక్కడ దొరుకుతాయంటే?

Update: 2025-03-07 05:11 GMT

most expensive fruits: మార్కెట్లో ఎన్నో రకాల పండ్లు అందుబాటులో ఉంటాయి. ఒక్కో పండుకు ఒక్కో ధర ఉంటుంది. ఉదాహరణకు అరటి పండ్లు డజన్ 40 నుంచి 50 రూపాయలు ఉంటుంది. సీజన్ లో వచ్చే పండ్లు అయితే కాస్త ఎక్కువ ధర ఉంటుంది. అయితే కొన్ని పండ్లు ఎవరూ కొనలేనంత ధర పలుకుతున్నాయి. అవి ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన పండ్లు. ఈ పండ్లు కొనాలంటే లక్షల వెచ్చించాల్సి ఉంటుంది. అలాంటి పది పండ్ల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

1. హక్కైడో పుచ్చకాయ (జపాన్)

దీన్ని'యుబారి కింగ్' పుచ్చకాయ అని కూడా పిలుస్తారు. దీని ధర దాదాపు 25,000 డాలర్లు అంటే దాదాపు 22 లక్షల రూపాయలు. ఇది జపాన్‌లోని హక్కైడోలోని ఒక ప్రత్యేక ప్రాంతంలో పెరుగుతుంది. జపాన్‌లో ధనవంతులు దీనిని బహుమతిగా ఇస్తారు.

2. రూబీ రోమన్ ద్రాక్ష (జపాన్)

ఈ ద్రాక్ష ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ద్రాక్షలలో ఒకటి. ఒక బ్యాగ్ ధర 8,400 డాలర్లు. ముదురు ఎరుపు రంగులో ఉంటుంది. ఇది సాధారణ మార్కెట్లో అందుబాటులో లేదు. కానీ వేలంలో అమ్ముతారు.

3. డెన్సుకే పుచ్చకాయ (జపాన్)

నల్ల తొక్కతో కూడిన ఈ ప్రత్యేక రకం పుచ్చకాయ 6,000 డాలర్లకు అమ్ముడవుతోంది. ఇది జపాన్‌లోని హక్కైడో ప్రాంతంలో మాత్రమే పెరుగుతుంది.

4. బిజెమ్ దురియన్ (థాయిలాండ్)

దురియన్ పండు ఆగ్నేయాసియాలో బాగా ప్రాచుర్యం పొందిన పండు. ఇది వెన్నలా మెత్తగా ఉంటుంది. దీని ధర $2,500 వరకు ఉంటుంది.

5. హెలిగాన్ గార్డెన్ పైనాపిల్ (ఇంగ్లాండ్)

ఇంగ్లాండ్‌లోని 'లాస్ట్ గార్డెన్ ఆఫ్ హెలిగాన్'లో పండించిన ఈ పైనాపిల్ $1,500కి అమ్ముడవుతోంది.

6. హమీ మెలోన్ (చైనా)

చైనాలోని జిన్జియాంగ్ ప్రాంతంలో పండించే ఈ ప్రత్యేక రకం పుచ్చకాయ ధర 200 నుండి 300 డాలర్లు.

7. టైయో నో టమాగో మామిడి (జపాన్)

ఇది జపాన్ కు చెందిన ఒక ప్రత్యేకమైన మామిడి పండు. ఇది పండిన తర్వాత ఎరుపు-నారింజ రంగులోకి మారుతుంది. దీని ఆకారం గుడ్డు వలే ఉంటుంది. అందుకే దీనిని 'సూర్యుడి గుడ్డు' అని పిలుస్తారు. దీని ధర 100 నుండి 200 డాలర్ల వరకు ఉంటుంది.

8. సిట్రస్ డెకోపాన్ (జపాన్)

ఇది ఒక ప్రత్యేకమైన నారింజ పండు. దీని ధర 80 నుండి 100 డాలర్లకు అమ్ముతారు. దీనికి విత్తనాలు ఉండవు.

9. సెకై ఇచి ఆపిల్ (జపాన్)

దీనికి 'ప్రపంచంలోనే అత్యుత్తమ ఆపిల్' అని పేరు పెట్టారు. ఒక ఆపిల్ ధర $21.

10. ఫుయు పెర్సిమోన్ (జపాన్)

ఇది జపాన్‌లో బాగా ప్రాచుర్యం పొందిన పండు. దీని ధర 10 మరియు 20 డాలర్ల మధ్య ఉంటుంది.

Tags:    

Similar News