Diabetic: మధుమేహ రోగులకి ఈ మొక్క ఆకులు దివ్యౌషధం..!

Diabetic: భారతదేశంలో మధుమేహం వేగంగా విస్తరిస్తోంది. ఇది ప్రజలలో పెద్ద వ్యాధిగా మారుతోంది.

Update: 2022-08-22 15:30 GMT

Diabetic: మధుమేహ రోగులకి ఈ మొక్క ఆకులు దివ్యౌషధం..!

Diabetic: భారతదేశంలో మధుమేహం వేగంగా విస్తరిస్తోంది. ఇది ప్రజలలో పెద్ద వ్యాధిగా మారుతోంది. ఒక్కసారి ఈ వ్యాధి వస్తే కంట్రోల్‌ చేయవచ్చు కానీ నిర్మూలించడం కష్టం. అందుకే చాలా మంది దీనిని సైలెంట్ కిల్లర్ అని పిలుస్తారు. శరీరంలో ఇన్సులిన్ లేకపోవడం వల్ల చక్కెర స్థాయి పెరుగుతుంది. అయితే మీరు శరీరంలో ఇన్సులిన్‌ను కంట్రోల్‌ చేయాలంటే ఇన్సులిన్‌ అనే మొక్క ఆకులని ఉపయోగించవచ్చు. ఈ ఆకుల వల్ల మధుమేహం నియంత్రణలో ఉంటుంది.

వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. డయాబెటిక్ రోగులు రోజుకు 6 నుంచి 7 సార్లు తేలికపాటి ఆహారం తీసుకోవాలి. తరచుగా భోజనం చేయడం వల్ల శరీరంలో ఇన్సులిన్ తయారవుతుంది. దీని కారణంగా శరీరంలో చక్కెర స్థాయి నియంత్రణలో ఉంటుంది. మీరు ఇన్సులిన్ మొక్క ఆకులను రోజుకు 4-5 సార్లు నమలవచ్చు. ఈ ఆకులలో కార్సోలిక్ యాసిడ్ ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల జలుబు, దగ్గు, ఇన్ఫెక్షన్, ఆస్తమా, ఊపిరితిత్తుల వ్యాధులలో మేలు జరుగుతుంది.

కావాలంటే ఇన్సులిన్ మొక్క ఆకులను పచ్చిగా నమలవచ్చు లేదా ఎండబెట్టి పొడి చేసి వాడుకోవచ్చు. మీరు ఈ ఆకులని తినేముందు ముందుగా వాటిని క్లీన్‌గా కడగండి. వీటిని తినడం వల్ల శరీరంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది. ఇన్సులిన్ ప్లాంట్‌లో అనేక పోషకాలు కనిపిస్తాయి. వీటిలో ఆస్కార్బిక్ యాసిడ్, ఐరన్, ప్రొటీన్, టెర్పెనాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్, B-కెరోటిన్, కరోసోలిక్ యాసిడ్, ఫ్లేవనాయిడ్స్, ఎంజైమ్‌లు ఉంటాయి. డయాబెటిస్‌తో పోరాడడంలో ఈ పోషకాలు గొప్పగా ఉపయోగపడుతాయి. ఇన్సులిన్ మొక్క ఆకులు అల్లోపతి మందుల దుష్ప్రభావాల నుంచి మిమ్మల్ని రక్షిస్తాయి.

Tags:    

Similar News