Health Tips: పగిలిన మడమలతో ఇబ్బందిగా ఉందా.. ఈ చిట్కాలతో నివారించండి..!

Health Tips: చలికాలంలో చాలామందికి మడమలు పగులుతాయి.

Update: 2023-02-05 02:30 GMT

Health Tips: పగిలిన మడమలతో ఇబ్బందిగా ఉందా.. ఈ చిట్కాలతో నివారించండి..!

Health Tips: చలికాలంలో చాలామందికి మడమలు పగులుతాయి. వీటిని పట్టించుకోపోతే సమస్య మరింత పెద్దదిగా మారుతుంది. ఇటువంటి పరిస్థితిలో పాదాల అందం పూర్తిగా చెడిపోతుంది. అయితే కొన్ని హోం రెమెడీస్‌ ద్వారా పగుళ్లని నయం చేయవచ్చు. వాస్తవానికి నీరు, దుమ్ము వల్ల మడమలు పగిలిపోయే అవకాశాలు పెరుగుతాయి. లోతుగా పగిలినప్పుడు చాలా నొప్పిగా ఉంటుంది. ఇలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే పగుళ్లు వచ్చేలోపు కొన్ని చర్యలు తీసుకోవడం మంచిది.

1. కొబ్బరి నూనె

మనం తరచుగా కొబ్బరినూనెను జుట్టుకు పట్టించడానికి ఉపయోగిస్తాం. కానీ మడమల పగుళ్లను నయం చేయడానికి కూడా దీనిని వాడుతారు. ఇది మడమలను తేమగా ఉంచడమే కాకుండా ఇన్ఫెక్షన్ నుంచి కాపాడుతుంది.

2. అరటి

అరటిపండు చర్మాన్ని పొడిబారకుండా కాపాడుతుంది. రెండు పండిన అరటిపండ్లను పేస్ట్‌లా చేసి పాదాల మడమల మీద 20 నిమిషాల పాటు అప్లై చేసి ఆపై శుభ్రం చేసుకోవాలి. మడమలు దాదాపు 2 వారాల్లో చక్కబడతాయి.

3. గోరువెచ్చని నీటితో శుభ్రపరచడం

పగిలిన మడమలను సరిచేయడానికి పాదాలను గోరువెచ్చని నీటిలో సుమారు 20 నిమిషాలు నానబెట్టాలి. తర్వాత మడమలను స్క్రబ్బర్‌తో రుద్దాలి. దానిలో ఉన్న డెడ్ స్కిన్‌ను నెమ్మదిగా తొలగించాలి. నీళ్లలోంచి తీసి ఆవాల నూనె రాసుకుని సాక్స్ వేసుకుంటే కొన్ని రోజుల్లో నయమవుతుంది.

Tags:    

Similar News