Copper Pot: రాగి పాత్రలోని నీటిని తాగితే అద్భుత ప్రయోజనాలు..!

Copper Pot: ప్రాచీన కాలంలో రాగి బిందెలు, రాగిపాత్రలు బాగా ప్రసిద్ది చెందినవి.

Update: 2022-04-15 15:00 GMT

Copper Pot: రాగి పాత్రలోని నీటిని తాగితే అద్భుత ప్రయోజనాలు..!

Copper Pot: ప్రాచీన కాలంలో రాగి బిందెలు, రాగిపాత్రలు బాగా ప్రసిద్ది చెందినవి. రాగిపాత్రలో నీళ్ళు తాగినా, రాగి పాత్రల్లో వంటలు చేసుకుని తిన్నా ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉండవని చాలా మంది నమ్మకం. రాగి పాత్రలో నీళ్ళు నింపి పెట్టడం వల్ల ఎన్ని రోజులైనా పాడవ్వకుండా ఉంటాయనేది పూర్వీకుల నమ్మకం. రాగిపాత్రలోని నీళ్ళు తాగడం వల్ల శరీరానికి ఎటువంటి రోగాలు సంభవించవని బలంగా నమ్మేవారు. ఆయుర్వేదం కూడా రాగిపాత్రలోని నీటిలో అద్భుత ఔషధగుణాలుంటాయని చెబుతోంది.

నీటిని శుద్ధి చేయడంలో రాగి ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఇందులో బ్యాక్టీరియాను నిర్మూలించే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉంటాయని సైన్స్ చెబుతోంది. రాగి ఆరోగ్యవంతమైన శరీరానికి అవసరమైన ఖనిజం. ఇది ఇనుముతో కలిపి రక్తం, రోగనిరోధక శక్తి, నాడీ వ్యవస్థ, ఎముకలను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. రాత్రిపూట 8 గంటలపాటు రాగి పాత్రలో నీటిని ఉంచి ఉదయం నిద్రలేచిన తర్వాత పరగడుపున వీటిని తాగాలి.

కీళ్లు లేదా మోకాళ్లలో నొప్పి ఉంటే పరగడుపున రాగి నీటిని తాగాలి. ఎందుకంటే అందులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇది శరీరంలో నొప్పిని కలిగించే వాపును తొలగించడంలో సహాయపడుతుంది. మోకాళ్ల నొప్పుల నుంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది. కొవ్వు కణాలను విచ్ఛిన్నం చేయడంలో రాగి ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఉదయాన్నే రాగి పాత్రలోని నీటిని తాగడం వల్ల బరువు తగ్గుతారు. బరువు తగ్గాలని ప్రయత్నించేవారు కచ్చితంగా రాగిపాత్రలోని నీటిని తాగాలి. మెదడుకు రాగి చాలా ముఖ్యం. ఎందుకంటే అందులో ఉండే న్యూరోట్రాన్స్‌మిటర్‌లను నియంత్రించడంలో రాగి సహాయపడుతుంది. దీని వల్ల పార్కిన్సన్స్, అల్జీమర్స్ వంటి మెదడు వ్యాధులకు దూరంగా ఉండటమే కాకుండా జ్ఞాపకశక్తి బలపడుతుంది.

Tags:    

Similar News