Coriander Water: పరగడుపున ధనియాల నీరు తాగితే అద్భుత ప్రయోజనాలు.. ఏంటంటే..?

Coriander Water: భారతీయ వంటకాలలో ధనియాలకు చాలా ప్రత్యేక స్థానం ఉంది. వంటలలో వీటిని విరివిగా వాడుతారు.

Update: 2022-01-27 01:30 GMT

Coriander Water: భారతీయ వంటకాలలో ధనియాలకు చాలా ప్రత్యేక స్థానం ఉంది. వంటలలో వీటిని విరివిగా వాడుతారు. ఇది వంటకాలకు మంచి రుచిని ఆపాదిస్తుంది. అంతేకాదు ధనియాలలో అద్భుత ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. పరగడుపున ధనియాల నీటిని తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది. ధనియాలలో పొటాషియం, కాల్షియం, విటమిన్ సి, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలు వ్యాధులను దూరంగా ఉంచడంలో సహాయపడతాయి.

ధనియాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఎందుకంటే ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌ను తగ్గించడంలో సహాయపడతాయి. ఇది అనేక వ్యాధులతో పోరాడడంలో సహాయపడుతుంది. ధనియాలలో విటమిన్ కె, సి, ఎ విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టు బలంగా వేగంగా పెరగడానికి దోహదం చేస్తాయి. ఉదయాన్నే ధనియాల నీరు తాగడం వల్ల జుట్టు రాలడం, చిట్లడం తగ్గుతుంది. మీరు ధనియాల నూనెని హెయిర్ మాస్క్‌గా కూడా అప్లై చేసుకోవచ్చు.

ధనియాలలో ఆహారాన్ని జీర్ణం చేసే గుణాలు అధికంగా ఉంటాయి. పరగడుపున ధనియాల నీరు తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. జీవక్రియ వేగవంతం అవుతుంది. ఈ రెండు లక్షణాలు మీ బరువు తగ్గించే ప్రక్రియలో సహాయపడతాయి. ధనియాలలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇందులో యాంటీ ఫంగల్‌, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. ఉదయాన్నే ధనియాల నీళ్లు తాగడం వల్ల చర్మం కాంతివంతంగా, మృదువుగా తయారవుతుంది. ధనియాలలో కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచే గుణాలు ఉన్నాయి. పరిశోధన ప్రకారం మీకు అధిక కొలెస్ట్రాల్ సమస్యలుంటే మీరు ధనియాల నీటిని రోజు తీసుకోవచ్చు. మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవడానికి ధనియాల నీరు తాగవచ్చు. 

Tags:    

Similar News