Health: ఆకస్మిక మూర్ఛ ఎప్పుడైనా ప్రమాదమే.. ఈ నాలుగు కారణాలు..?

Health: స్పృహతప్పి పడిపోవడానికి గల కారణాలు ఏంటని ఎప్పుడైనా ఆలోచించారా..

Update: 2022-02-21 15:30 GMT

Representational Image

Health: స్పృహతప్పి పడిపోవడానికి గల కారణాలు ఏంటని ఎప్పుడైనా ఆలోచించారా.. పూర్తి ఫిట్‌గా, ఆరోగ్యంగా కనిపిస్తున్నా కారణం లేకుండానే ఒక్కోసారి స్పృహ తప్పి పడిపోతారు. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. మెదడుకి ఆక్సిజన్ అందకపోవడం వల్ల మూర్ఛ వస్తుంది. దానికి కొన్ని కారణమైన అంశాలు ఉన్నాయి. భవిష్యత్తులో సమస్యలు రాకుండా ఉండాలంటే వాటిని తెలుసుకోవడం ముఖ్యం.

1. తక్కువ రక్తపోటు

స్పృహ కోల్పోవడానికి ప్రధాన కారణం తక్కువ రక్తపోటు. ఇది ముఖ్యంగా 65 ఏళ్ల కంటే ఎక్కువ వయస్సు ఉన్న వారికి వస్తుంది.

2. డీహైడ్రేషన్

మీ శరీరం నిర్జలీకరణానికి గురైనప్పుడు మీ రక్తంలో ద్రవం పరిమాణం తగ్గుతుంది. రక్తపోటు తగ్గడం వల్ల మూర్ఛపోయే ప్రమాదం పెరుగుతుంది.

3. మధుమేహం

మీరు డయాబెటిక్ పేషెంట్ అయితే మీకు మూర్ఛపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే మీరు డయాబెటిక్ అయితే తరచూ మూత్ర విసర్జనకి వెళ్లాల్సి ఉంటుంది. ఇది మిమ్మల్ని డీహైడ్రేషన్ ప్రమాదానికి గురి చేస్తుంది.

4. గుండె జబ్బులు

గుండె జబ్బులు కూడా మూర్ఛపోవడానికి ఒక ముఖ్యమైన కారణంగా పరిగణిస్తారు. ఎందుకంటే ఇది జరిగినప్పుడు మీ మెదడుకు రక్త సరఫరా నిలిచిపోతుంది. వైద్య పరిభాషలో ఈ రకమైన మూర్ఛను కార్డియాక్ సింకోప్ అంటారు. ఈ నాలుగు కారణాల వల్ల స్పృహతప్పి పడిపోతారు. అందుకే వీటి విషయంలో జాగ్రత్తగా ఉంటే మంచిది.

Tags:    

Similar News