Health Tips: ఇలాంటి వ్యక్తులకి గుండెపోటు ప్రమాదం ఎక్కువ.. జాగ్రత్తలు తప్పనిసరి..!

Health Tips: గుండె లేకుండా జీవితాన్ని ఊహించలేము.

Update: 2022-12-01 14:30 GMT

Health Tips: ఇలాంటి వ్యక్తులకి గుండెపోటు ప్రమాదం ఎక్కువ.. జాగ్రత్తలు తప్పనిసరి..!

Health Tips: గుండె లేకుండా జీవితాన్ని ఊహించలేము. అది పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు నాన్‌స్టాప్‌గా కొట్టుకుంటూనే ఉంటుంది. కానీ దీని భద్రత గురించి చాలామంది అశ్రద్ధ వహిస్తారు. ఎప్పుడైతే గుండెల్లో సమస్యలు రాబోతున్నాయో అంతకుముందే కొన్ని హెచ్చరికలు కనిపిస్తాయి. మీరు హార్ట్ ఎటాక్, కరోనరీ ఆర్టరీ డిసీజ్ లేదా ట్రిపుల్ వెస్సెల్ డిసీజ్ వంటి జబ్బుల బారిన పడకుండా ఉండాలంటే గుండెకు సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. వాటి గురించి తెలుసుకుందాం.

గుండెపోటు నివారించే మార్గాలు

నిత్యం బరువును తనిఖీ చేస్తూ ఉండాలి. స్థూలకాయులు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. రోజువారీ జీవితంలో సాధ్యమైనంత ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినాలి. అధిక రక్తపోటు ఉన్నప్పుడు ఉప్పు తీసుకోవడం తగ్గించాలి. అతిగా కాఫీ తాగకూడదు. ఇది రక్తపోటును పెంచుతుంది. మధుమేహం రోగులకు గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. వైద్యుల సలహా లేకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ మందులు తీసుకోవద్దు.

నడుస్తున్నప్పుడు గుండె చప్పుడులో అసౌకర్యం ఉంటే వెంటనే డాక్టర్‌ని సంప్రదించాలి. వీలైనంత వరకు నూనెతో కూడిన ఆహారానికి దూరంగా ఉండాలి. గుండె ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుకోవాలనుకుంటే ముందుగా తినే ఆహారాన్ని మార్చుకోవాలి. ఇందుకోసం ఒమేగా-3, యాంటీ ఆక్సిడెంట్లు, పీచుపదార్థాలు, మినరల్స్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. ముఖ్యంగా జ్యుసి ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలి. అతిగా వేయించిన, కారంగా ఉండే వస్తువులకు దూరంగా ఉండాలి.

శారీరక కార్యకలాపాలు

మీరు హృదయాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే ఆరోగ్యకరమైన ఆహారంతో పాటు శారీరక శ్రమ ముఖ్యం. లేదంటే శరీరంలోని కొవ్వు సులభంగా తగ్గదు. ఊబకాయం బారిన పడుతారు. ఆరోగ్యాన్ని పాడుచేసే కొన్ని చెడు అలవాట్లు ఉంటాయి. చాలా మంది యువత సిగరెట్, మద్యానికి బానిసలుగా మారారు. దీని కారణంగా గుండె ఆరోగ్యం చాలా ఘోరంగా దెబ్బతింటోంది. ఈ అలవాట్లని ఎంత త్వరగా వదిలించుకుంటే అంత మంచిది.

Tags:    

Similar News