Weather Change Problems: వాతావరణం మారితే చిన్నపిల్లలపై తీవ్ర ప్రభావం.. ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త..!

Weather Change Problems: వాతావరణం ఎప్పుడు ఏ విధంగా ఉంటుందో తెలియడం లేదు. మధ్యాహ్నం అతి వేడిగా రాత్రి అతి చల్లగా ఉంటుంది.

Update: 2024-02-19 14:30 GMT

Weather Change Problems: వాతావరణం మారితే చిన్నపిల్లలపై తీవ్ర ప్రభావం.. ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త..!

Weather Change Problems: వాతావరణం ఎప్పుడు ఏ విధంగా ఉంటుందో తెలియడం లేదు. మధ్యాహ్నం అతి వేడిగా రాత్రి అతి చల్లగా ఉంటుంది. శీతాకాలం ముగింపు దశకు వచ్చింది ఎండాకాలం ప్రారంభ దశ మొదలైంది. ఈ సమయంలో చిన్నపిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ సమయంలో వ్యాధుల ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. మారుతున్న వాతావరణంతో వారు జలుబు, వైరల్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, లూజ్ మోషన్, జ్వరం వంటి సమస్యలను ఎదుర్కోవచ్చు. కాబట్టి పిల్లల ఆరోగ్యం పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవడం అవసరం.

ఆహారం, పానీయం

ఈ సమయంలో పిల్లలు అనారోగ్యం బారిన పడటానికి అతిపెద్ద కారణం వారి శరీరంలో అవసరమైన పోషకాలు లేకపోవడం. ఈ పరిస్థితిలో పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే వారికి ఇంట్లో తయారుచేసిన ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినిపించాలి.

నీరు

మారుతున్న వాతావరణంలో పిల్లలకి కాచి వడబోసిన నీటిని తాగించాలి. ఇది బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ప్రమాదం నుంచి పిల్లలను దూరంగా ఉంచుతుంది. అలాగే పిల్లల రోగనిరోధక శక్తిని పెంచడానికి వారికి తాజా పండ్లు, కూరగాయలను తినిపించాలి. కానీ అంతకుముందు వాటిని శుభ్రమైన నీటితో కడగాలని గుర్తుంచుకోండి.

ఫ్యాన్ నడపవద్దు

ఈ సీజన్‌లో ఉదయం, సాయంత్రం వాతావరణం చల్లగా, పగటిపూట కొద్దిగా వేడిగా ఉంటుంది. పిల్లల గదిలో పొరపాటున కూడా ఫ్యాన్, ఏసీ పెట్టవద్దు. ఎందుకంటే వారు అనారోగ్యానికి గురయ్యే అవకాశాలు ఉంటాయి. గది టెంపరేచర్‌లో నే ఉంచాలి.

వెచ్చని దుస్తులు

మారుతున్న రుతువులకు అనుగుణంగా ఉష్ణోగ్రత మారుతూ ఉంటాయి. ఈ పరిస్థితిలో వెచ్చని దుస్తులు ధరించడమే ఉత్తమం. పిల్లల అరచేతులు, అరికాళ్లు కప్పి ఉంచాలి.

చల్లని విషయాలు

మారుతున్న వాతావరణంలో పిల్లలను వ్యాధుల నుంచి రక్షించడానికి చల్లని వస్తువులకు దూరంగా ఉంచాలి. ఎందుకంటే వారికి వేడిగా అనిపించినప్పుడు పిల్లలు చల్లటి నీరు, శీతల పానీయాలు లేదా ఐస్ క్రీం తింటామని పట్టుబడుతారు. కానీ ఇది పిల్లల ఆరోగ్యాన్ని మరింత దిగజార్చుతుంది. అందువల్ల ఈ సీజన్‌లో చల్లని వస్తువులను నివారించడం ఉత్తమం.

Tags:    

Similar News