Sara Ali Khan Weight Loss Journey: 45 కిలోలు తగ్గిన సారా అలీఖాన్... ఆమె వెయిట్ లాస్ ఎలా అయిందంటే

Sara Ali Khan Weight Loss Journey: అమృతా సింగ్, సైఫ్ అలీ ఖాన్ కూతురు సారా అలీఖాన్ మొదటి సినిమాతోనే తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది.

Update: 2025-07-18 13:56 GMT

Sara Ali Khan Weight Loss Journey: 45 కిలోలు తగ్గిన సారా అలీఖాన్... ఆమె వెయిట్ లాస్ ఎలా అయిందంటే

Sara Ali Khan Weight Loss Journey: అమృతా సింగ్, సైఫ్ అలీ ఖాన్ కూతురు సారా అలీఖాన్ మొదటి సినిమాతోనే తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది. కొలంబియా యూనివర్శిటీలో చదువు పూర్తి చేసి నటనా రంగంలోకి అడుగు పెట్టిన సారా తనకంటూ ఒక ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుంది. ఇటు సినిమాలు, అటు వెబ్ సిరీస్‌లో బిజీగా ఉన్న ఈ ముద్దు గుమ్మ సినిమారంగంలోకి రాకముందు 96 కిలోల బరువు ఉండేదట. అయితే ఆ తర్వాత స్ట్రిక్ట్‌ గా చేసిన వెయిట్ లాస్ జర్నీతో 47కిలోలు తగ్గిందట. ఆ ముద్దు గుమ్మ చెప్పిన వెయిట్ లాస్ జర్నీ ని ఇపుడు చూద్దాం.

సారా అలీఖాన్ 91 కిలోలు ఉన్న సమయంలో ఆమె చాలా రకాల అనారోగ్య సమస్యలతో బాధపడేది. ఆమెకు పీసీఒఎస్. దీనివల్ల కూడా చాలామంది అమ్మాయిలు బరువు పెరుగుతారు. హార్మోన్ల ఇన్ బ్యాలెన్స్‌తో రకరకాల ఇబ్బందులకు గురవుతారు. సారా కూడా చాలా రకాల ఇబ్బందులను ఎదుర్కొంది. అయితే ఎప్పుడు తనకు పీసీఒఎస్ అని తెలుసుకుందో అప్పటి నుంచి తన వెయిట్ లాస్ జర్నీని మొదలుపెట్టింది.

నో షుగర్ నో మిల్క్

పాలు, పాలతో చేసిన ఏ ఆహార పదార్ధాలను ఆమె కొంతకాలం పాటు తినలేదు. ఇక పంచదార సంగతైతే ఎందులోనూ ఆమె పంచదారను వేసుకోలేదు. పంచదారతో చేసిన ఏ స్వీట్ ఆమె తినలేదు. పూర్తిగా వీటిని తన లైఫ్‌లో బ్యాన్ చేసింది. ఇక ఇంట్లో చేసిన ఆహార పదార్ధాలనే తినేది. బయట వాటిని పూర్తిగా బంద్ చేసింది. వీటితో పాటు చక్కెర, పాలు, కార్బొహైడ్రేట్లు లేని ఆహారానికి బాయ్ బాయ్ చెప్పేసి.. ప్రొటీన్లు, ఐరన్ ఉన్న ఆహారాలు తినడం మొదలుపెట్టింది. ముఖ్యంగా నీళ్లు ఎక్కువగా తాగేది. జీలకర్ర నీళ్లు, కొత్తిమీర నీళ్లు.. ఇలా పలు రకాలుగా శరీరంలోకి నీళ్లను పంపింది. సమయానికి తినడం, సమయానికి పడుకోవడం ఈ రెండే తన లైఫ్‌లో ముఖ్యమనుకుంది. అందుకే ప్లాన్ ప్రకారం వీటిని ఫాలో అయ్యింది.. బరువును తగ్గించుకుంది.

వ్యాయామం

బరువు తగ్గాలంటే జిమ్‌లకు వెళ్లాలని చాలామంది అనుకుంటారు. కానీ సారా అలా కాదు.. ప్రతిరోజూ ఉదయం సాయంత్రం డ్యాన్స్ లేదా వ్యాయామం చేసేది. ఎక్కువగా నడిచేది. సమయం దొరికితే చాలు శరీరానికి అలసట ఇచ్చేది. ఇలా చేయడం వల్లే ఆమె తొందరగా వెయిట్ లాస్ అయింది. అది కూడా 46 కిలోలు తగ్గింది.

పాజిటివ్ మైండ్ అవసరం..

వీటితో పాటు మనసు చాలా ప్రశాంతంగా ఉండాలి. ముఖ్యంగా పాజిటివ్ మైండ్ చాలా అవసరం. ప్రతిదీ చాలా పాజిటివ్‌గా తీసుకోవాలి. అప్పుడే మనం అనుకున్నది సాధించగలుగుతామని సారా చెబుతుంది.

Tags:    

Similar News