Men Health: పురుషులలో క్యాన్సర్‌ ప్రమాదం.. ఈ టెస్ట్‌లు చేయించుకుంటే బెటర్..!

Men Health: నేటి జీవితం చాలా ఒత్తిడితో కూడుకున్నది. జనాలు తమని తాము చేసుకోలేనంత బిజీగా గడుపుతున్నారు.

Update: 2022-12-17 16:00 GMT

Men Health: పురుషులలో క్యాన్సర్‌ ప్రమాదం.. ఈ టెస్ట్‌లు చేయించుకుంటే బెటర్..!

Men Health: నేటి జీవితం చాలా ఒత్తిడితో కూడుకున్నది. జనాలు తమని తాము చేసుకోలేనంత బిజీగా గడుపుతున్నారు. ఆడవాళ్ళలాగే మగవాళ్ళు కూడా తమ ఆరోగ్యంతో ఆడుకుంటూ ఎన్నో అనారోగ్య సమస్యలను ఆహ్వానిస్తున్నారు. ధూమపానం, తప్పుడు ఆహారం, మద్యపాన వ్యసనం వంటి అలవాట్లకి బానిసలుగా మారి క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధులకు గురవుతున్నారు. ఇది ఒక నయం కాని వ్యాధి. వీటి గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం.

ప్రోస్టేట్ క్యాన్సర్

పురుషుల్లో వచ్చే అత్యంత సాధారణ క్యాన్సర్ ఇది. వయస్సు పెరుగుతున్న కొద్ది ఇది సంభవించే అవకాశాలు పెరుగుతాయి. దీన్ని గుర్తించడానికి ముందుగా డాక్టర్‌ని సంప్రదించి సరైన టెస్టులు చేయించుకోవాలి.

కొలొరెక్టల్ క్యాన్సర్

ఈ క్యాన్సర్ పురుషులలో సాధారణమైనదిగా చెబుతారు. ఊబకాయం, పోషకాహార లోపం, రెడ్ మీట్, ధూమపానం, ఆల్కహాల్, కుటుంబ చరిత్ర కారణంగా పురుషులలో ఈ రకమైన క్యాన్సర్ వస్తుంది. 45 ఏళ్ల తర్వాత రెగ్యులర్ స్క్రీనింగ్ చేయాలని నిపుణులు చెబుతున్నారు. ఇందులో మల పరీక్ష, కొలొనోస్కోపీ, CT స్కాన్ చేస్తారు.

ఊపిరితిత్తుల క్యాన్సర్

ఎవరైనా అతిగా ధూమపానం చేస్తే ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ధూమపానం మానేయడం లేదా తగ్గించడం ద్వారా ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించవచ్చు. సిగరెట్‌ తాగేవారు తరచుగా డాక్టర్‌ని సంప్రదించి టెస్ట్‌ చేయించుకోవాలి. లంగ్స్‌ కెపాసిటీ పెంచుకునేందుకు ప్రయత్నించాలి.

Tags:    

Similar News