Marriage: కొత్తగా పెళ్లి అయిందా? ఈ లక్షణాలు కనిపిస్తే అప్రమత్తంగా ఉండాలి!
Marriage: పెళ్లి అనేది ఇద్దరు వ్యక్తుల మధ్య ఏర్పడే ఒక పవిత్రమైన బంధం. ఇది ప్రేమ, నమ్మకం, గౌరవం, నిబద్ధత వంటి విలువలతో కూడిన ఒక లోతైన సంబంధం. ఇది ఇద్దరు వ్యక్తుల జీవితాలను ఒకచోట చేర్చి, ఒకరికొకరు తోడుగా, జీవితాంతం కలిసి నడవడానికి ఏర్పరచుకునే బంధం.
Marriage: కొత్తగా పెళ్లి అయిందా? ఈ లక్షణాలు కనిపిస్తే అప్రమత్తంగా ఉండాలి!
Marriage: పెళ్లి అనేది ఇద్దరు వ్యక్తుల మధ్య ఏర్పడే ఒక పవిత్రమైన బంధం. ఇది ప్రేమ, నమ్మకం, గౌరవం, నిబద్ధత వంటి విలువలతో కూడిన ఒక లోతైన సంబంధం. ఇది ఇద్దరు వ్యక్తుల జీవితాలను ఒకచోట చేర్చి, ఒకరికొకరు తోడుగా, జీవితాంతం కలిసి నడవడానికి ఏర్పరచుకునే బంధం. ఇద్దరు భిన్నమైన వ్యక్తులు ఒకే దారిలో కలిసి నడవాలంటే అనుబంధం, సహనం, అర్థం చేసుకోవడం అత్యంత ముఖ్యమైనవి. అయితే, పెళ్లి అయిన కొత్తలో ఈ లక్షణాలు కనిపిస్తే మీరు అప్రమత్తంగా ఉండాలి. లేదంటే తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది.
ఎక్కువ అంచనాలు పెట్టుకోవడం
కొత్తగా పెళ్లైన దంపతులు ఒకరినొకరు సినిమాల్ని తలచుకొని ఊహల్లో బ్రతుకుతారు. కానీ, వాస్తవ జీవితం.. సినిమా వేరు. జంటగా జీవించాలంటే అంచనాలను తగ్గించుకొని నిజమైన మనుషులను అర్థం చేసుకోవడం అవసరం.
చిన్న విషయాలకే పెద్ద గొడవలు
తినే టేబుల్ దగ్గర నుంచి టీవీ రిమోట్ వరకు.. చిన్న విషయాలకే వివాదాలు మొదలవుతుంటే జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి చిన్న చిన్న విషయాలకు గొడవలు పడకుండా సమయానుసారంగా మాట్లాడుకొని క్లియర్ చేసుకోకపోతే, పెద్ద సమస్యలుగా మారతాయి.
వ్యక్తిగత స్వేచ్ఛ లేకపోవడం
పెళ్లయిన తర్వాత వ్యక్తిత్వాన్ని కోల్పోకూడదు. పరస్పరం గౌరవించుకోవడం తప్పనిసరి. వ్యక్తిగత స్వేచ్ఛ లేకపోవడం వల్ల ఆ బంధంలో అసమ్మతి మొదలవుతుంది. కాబట్టి, వ్యక్తిగత స్వేచ్ఛ ఇవ్వండి.
నమ్మకం లోపించడం
పెళ్లి బంధంలో నమ్మకం పునాది లాంటిది. అర్థం లేని అనుమానాలు ఉన్నట్లయితే అది ఒక డేంజర్ సిగ్నల్. ఇలాంటి సమయంలో ఓపికగా కూర్చొని మాట్లాడుకోవడమే మంచి మార్గం.
వ్యక్తిగతంగా మాట్లాడే అవకాశాలు లేకపోవడం
ఉద్యోగం, ఫోన్లు, టీవీ, సోషల్ మీడియా.. అంటూ వ్యక్తిగతంగా మాట్లాడే అవకాశాలు లేకపోవడం దూరానికి సంకేతం. ప్రతి రోజూ కొద్దిసేపైనా హృదయపూర్వకంగా మాట్లాడుకోవాలి. ఇలా మాట్లాడుకోవడం వల్ల సమస్యలు తొలగిపోతాయి.
ఏం చేయాలి
* మొదటి నుంచే క్లియర్ కమ్యూనికేషన్ ఉండాలి.
* ఏవైనా సమస్యలు ఉంటే వెంటనే మాట్లాడుకోవాలి.
* ఒకరిపై ఒకరు విమర్శలు, ఒత్తిడి చేయకూడదు.
* వ్యక్తిగత స్పేస్‌ని గౌరవించాలి.
* నమ్మకం బలపడేలా ప్రవర్తించాలి.
కొత్తగా పెళ్లయిన దంపతులకు ఆరంభంలో సమస్యలు రావడం సహజమే. కానీ వాటిని పరిష్కరించకపోతే తర్వాత అవి పెద్దవైపోతాయి. ఈ చిన్నచిన్న సంకేతాలను గుర్తించి అవగాహనతో, ప్రేమతో వ్యవహరిస్తే, వైవాహిక జీవితం ఓ అద్భుతమైన ప్రయాణంగా మారుతుంది.