Relationship: మీ లవర్‌కు ఈ గిఫ్ట్స్ ఇస్తున్నారా.. విడిపోవడం ఖాయం!
Relationship: ప్రేమికులు ఒకరికొకరు బహుమతులు ఇచ్చుకోవడం సాధారణం. అయితే, కొన్ని వస్తువులను బహుమతిగా ఇవ్వడం వల్ల ఆ బంధంలో సమస్యలు వస్తాయని రిలేషన్‌షిప్ నిపుణులు చెబుతున్నారు.
Relationship: మీ లవర్‌కు ఈ గిఫ్ట్స్ ఇస్తున్నారా.. విడిపోవడం ఖాయం!
Relationship: ప్రేమికులు ఒకరికొకరు బహుమతులు ఇచ్చుకోవడం సాధారణం. అయితే, కొన్ని వస్తువులను బహుమతిగా ఇవ్వడం వల్ల ఆ బంధంలో సమస్యలు వస్తాయని రిలేషన్‌షిప్ నిపుణులు చెబుతున్నారు. ఈ వస్తువులను మీ ప్రియమైన వారికి ఇస్తే అవి మీరు విడిపోవడానికి దారితీస్తాయని అంటున్నారు. కాబట్టి, ఏ వస్తువులను బహుమతులుగా ఇవ్వకూడదో ఇప్పుడు తెలుసుకుందాం..
ముళ్ల మొక్కలు: కొంతమంది తమ భాగస్వామికి మొక్కలు అంటే ఇష్టమని వివిధ రకాల మొక్కలను బహుమతులుగా ఇస్తారు. అయితే, ఎట్టి పరిస్థితుల్లోనూ ముళ్ల మొక్కను బహుమతిగా ఇవ్వకుడదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే, ఈ బహుమతులు మీ సంబంధానికి హాని కలిగిస్తాయి. ఈ మొక్కలు ప్రతికూల శక్తిని విడుదల చేస్తాయి. దీని వలన జీవిత భాగస్వాముల మధ్య ఉద్రిక్తత, సంఘర్షణ ఏర్పడుతుంది. కాబట్టి, మీ ప్రేమ జీవితంలో ఇబ్బందులను నివారించడానికి గులాబీల వంటి సానుకూలతను ప్రసరింపజేసే మొక్కలను బహుమతిగా ఇవ్వండి.
గాజుసామాను: గాజుసామాను కాస్తా అజాగ్రత్తగా ఉన్న విరిగిపోతుంది. అదేవిధంగా, గాజు వస్తువులను బహుమతులుగా ఇవ్వడం వల్ల కూడా సంబంధం తెగిపోతుందని నమ్ముతారు. గాజు వస్తువులను బహుమతిగా ఇవ్వడం వల్ల సంబంధంలో వాదనలు, ఉద్రిక్తతలు ఏర్పడతాయి. ఇది సంబంధంలో అశాంతి, ప్రతికూలతను కూడా ఆకర్షిస్తుంది. కాబట్టి గాజు వస్తువులను బహుమతిగా ఇవ్వకండి.
పెర్ఫ్యూమ్స్: పెర్ఫ్యూమ్‌ను ఎవరికీ బహుమతిగా ఇవ్వకూడదని అంటారు. దీనివల్ల జీవితంలో డబ్బు లేకపోవడం, అనేక ఇతర సమస్యలు వస్తాయని అంటారు. ఇది ప్రతికూల శక్తిని పెంచుతుంది. కాబట్టి, దీన్ని బహుమతిగా ఇవ్వకండి.
నల్ల వస్తువులు: బట్టలు, గృహాలంకరణ వస్తువులతో సహా ఎలాంటి నల్ల వస్తువులను బహుమతిగా ఇవ్వకండి. అది మీ సంబంధంపై ప్రతికూల ప్రభావాన్ని చూపవచ్చు. నమ్మకాల ప్రకారం నలుపు రంగు ప్రతికూలత, విచారం, ఒంటరితనానికి చిహ్నంగా పరిగణించబడుతుంది. నల్లటి వస్తువులను బహుమతులుగా ఇవ్వడం వల్ల ప్రతికూల శక్తి ఆకర్షిస్తుంది. దీని వలన భార్యాభర్తల మధ్య అపార్థాలు, గొడవలు వస్తాయి.
గడియారం: సమయం అందరికీ విలువైనది. కానీ సమయం చెప్పే గడియారాన్ని బహుమతిగా ఇవ్వకూడదని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే అది జీవితంలో అడ్డంకులు, జాప్యాలు, ఇబ్బందులకు దారితీస్తుంది.