Health: గర్బాశయం తొలగించకుండా.. అరుదైన చికిత్స చేసిన డాక్టర్లు

Health: ఒక వైపు తీవ్ర రక్త స్రావం, మరోవైప గర్భాశయంలో ఫైబ్రాయిడ్‌. ప్రాణాపాయ స్థితే. ఈ కంప్లైంట్స్‌తో ఎవరిదగ్గరకు వెళ్లినా.. ఆపరేషనే చేసి గర్భాశయం తీసేయాలనే చాలామంది డాక్టర్లు అంటారు.

Update: 2025-07-04 14:00 GMT

Health: గర్బాశయం తొలగించకుండా.. అరుదైన చికిత్స చేసిన డాక్టర్లు

ఒక వైపు తీవ్ర రక్త స్రావం, మరోవైప గర్భాశయంలో ఫైబ్రాయిడ్‌. ప్రాణాపాయ స్థితే. ఈ కంప్లైంట్స్‌తో ఎవరిదగ్గరకు వెళ్లినా.. ఆపరేషనే చేసి గర్భాశయం తీసేయాలనే చాలామంది డాక్టర్లు అంటారు. కానీ ఈ వైద్యులు మాత్రం గర్భాశయం తొలగించకుండానే అరుదైన చికిత్స చేశారు.

ఖమ్మానికి చెందిన నందిత(35) అనే మహిళకు కొన్నాళ్ల నుంచి తీవ్ర రక్తస్రావం జరుగుతుంది. పైగా గర్భాశ్రయంలో ఫైబ్రాయిడ్ ఉన్నాయి. చాలామంది డాక్టర్లు ఆమెకు ఆపరేషన్ చేయాలని అన్నారు. కానీ ఆమెకు రక్తం తక్కువగా ఉండడంతో ఆపరేషన్‌ను వాయిదా వేసుకుంటూ వచ్చారు. అయితే వారం రోజుల క్రితం ఆమెకు తీవ్రమైన రక్తస్రావం జరిగింది. హమోగ్లోబిన్ స్థాయి కేవలం 3.7 జీఎం/డీఎల్‌గా ఉంది. ఆమె ఆరోగ్య పరిస్థితి క్రమంగా క్షీణిస్తు వెళుతుండడంతో ఎమర్జెన్సీలో ఆమెను చేర్చారు. ఆమెకు 16 యూనిట్ల రక్తాన్ని ఎక్కించారు.

ఆమె శరీరంలో ఫైబ్రాయిడ్ పరిమాణం 10 సెంటీమీటర్లు ఉంది. దాన్ని తీయాలంటే సర్జరీ అవసరం. కానీ రక్తం తగ్గే ప్రమాదం ఉంది. అందుకే మెడికవర్ ఉమెన్ చైల్డ్ హస్పిటల్‌ డాక్టర్లు ఫైబ్రాయిడ్‌ను తొలగించి.. గర్భాశయాన్ని రక్షించే ప్రాసెస్ చేయాలనుకున్నారు. దీనికోసం రోబోటిక్, లాపరోస్కోపిక్ సర్జన్ పృద్వీ పెరుమ్, సర్జికల్ ఆంకాలజీ డాక్టర్ అజయ్ వరుణ్ రెడ్డి, అనస్తీషియా డాక్డర్ శిల్ప సహకారంతో ఆపరేషన్‌ నిర్వహించారు. ఆపరేషన్ చేస్తున్న సమయంలో రక్త స్రావాన్ని తగ్గించేందుకు, తాత్కాలిక గర్భాశయ ధమని అడ్డుకునే అధునాతీన సాంకేతికతను ఉపయోగించారు. ఈ విధానం అధిక ప్రమాదంలోనూ ఫైబ్రాయిడ్‌ను సురక్షితంగా తొలగించేందుకు సహాయపడిందన్నారు. ఆమె పూర్తిగా కోలుకుందని డిశ్చార్జ్ చేసినట్లు కూడా డాక్టర్లు చెప్పారు.

Tags:    

Similar News