Raisins: ఎండు ద్రాక్షలో ఔషధ గుణాలు మెండు.. కానీ ఏ రంగు ద్రాక్ష మంచిదో తెలుసా..?

Raisins: ఎండు ద్రాక్షలో ఔషధ గుణాలు మెండు.. కానీ ఏ రంగు ద్రాక్ష మంచిదో తెలుసా..?

Update: 2022-07-24 14:30 GMT

Raisins: ఎండు ద్రాక్షలో ఔషధ గుణాలు మెండు.. కానీ ఏ రంగు ద్రాక్ష మంచిదో తెలుసా..?

Raisins: ఎండుద్రాక్షలో అద్భుత ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. ఇది శరీరానికి చాలా మేలు చేస్తుంది. ప్రతి ఒక్కరు ఆహారంలో ఎండుద్రాక్షను తప్పనిసరిగా చేర్చుకోవాలి. అయితే ఎండు ద్రాక్షను కొనుగోలు చేసేటప్పుడు ఎలాంటి ఎండు ద్రాక్ష కొనుగోలు చేయాలో చాలామందికి తెలియదు. మార్కెట్‌లో అనేక రకాల ఎండుద్రాక్షలు కనిపిస్తాయి. మీరు నలుపు ఎండుద్రాక్ష, ఆకుపచ్చ ఎండుద్రాక్ష, ఎరుపు ఎండుద్రాక్ష, పసుపు ఎండుద్రాక్ష చూస్తారు. అయితే ఇందులో ఏది మంచిదో ఈ రోజు తెలుసుకుందాం.

ఎండుద్రాక్షని డైఫ్రూట్స్‌గా చెబుతారు. ఇది చాలా చౌకగా దొరుకుతుంది. అంతేకాదు చాలా రుచిగా ఉంటుంది. వివిధ రకాల ద్రాక్ష, బెర్రీలను ఎండబెట్టడం ద్వారా ఎండుద్రాక్ష తయారు చేస్తారు. వీటిలో ప్రొటీన్లు, ఐరన్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఎండుద్రాక్షలో విటమిన్ B6, కాల్షియం, పొటాషియం, కాపర్ ఉంటాయి. ఎండుద్రాక్షలో యాంటీఆక్సిడెంట్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. ఎండుద్రాక్షలు వాటి సొంత లక్షణాలను కలిగి ఉంటాయి. ఇందులో మీకు ఏది నచ్చితే అది కొనుగోలు చేయవచ్చు.

కానీ బంగారు ఎండుద్రాక్ష అని పిలువబడే సుల్తానా ఎండుద్రాక్షలు ఆరోగ్యానికి చాలా మంచివి. ఫైబర్, పొటాషియం, ఐరన్ వంటి అనేక ఖనిజాలు ఇందులో లభిస్తాయి. మీరు ఖచ్చితంగా వీటిని ఆహారంలో చేర్చుకోవాలి. అయితే మీరు అధిక పరిమాణంలో ఎండుద్రాక్ష తినడం మానుకోవాలి. ఎందుకంటే ఎండుద్రాక్ష చాలా తీపిగా ఉంటుంది. ఇది బరువు పెరగడానికి సహాయపడుతుంది. ఎండు ద్రాక్షను తినడానికి సరైన మార్గం రాత్రిపూట నానబెట్టి ఉదయం పరగడుపున తీసుకోవాలి.

Tags:    

Similar News