Heart Attack: ఈ ఒక్క చెడ్డ అలవాటు మానేస్తే గుండెపోటు ప్రమాదం తగ్గినట్లే..!

Heart Attack: భారతదేశంలో గుండెపోటు సమస్య వేగంగా వ్యాపిస్తోంది. ఇటీవల బాలీవుడ్ ప్రసిద్ధ గాయకుడు కెకె గుండెపోటుతో మరణించారు.

Update: 2022-06-06 14:30 GMT

Heart Attack: ఈ ఒక్క చెడ్డ అలవాటు మానేస్తే గుండెపోటు ప్రమాదం తగ్గినట్లే..!

Heart Attack: భారతదేశంలో గుండెపోటు సమస్య వేగంగా వ్యాపిస్తోంది. ఇటీవల బాలీవుడ్ ప్రసిద్ధ గాయకుడు కెకె గుండెపోటుతో మరణించారు. అతనికి కేవలం 53 సంవత్సరాలు మాత్రమే. గతంలో కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ కూడా ఈ కారణంగా ప్రపంచానికి వీడ్కోలు పలికారు. తాజా నివేదికల ప్రకారం భారతదేశంలో ప్రతి సంవత్సరం లక్ష మందిలో 272 మంది గుండె జబ్బుల కారణంగా మరణిస్తున్నారు. కాగా ప్రపంచం మొత్తంలో ఏటా 13 నుంచి 14 లక్షల మంది హృద్రోగులుగా మారుతున్నారు. వీరిలో 8 శాతం మంది గుండెపోటు వచ్చిన 30 రోజులలోపు మరణిస్తారు. అంటే దాదాపు 1.25 లక్షల మంది గుండెపోటు వచ్చిన 30 రోజుల్లోనే ప్రాణాలు కోల్పోతున్నారు.

సిగరెట్ తాగడం వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉందని ఇప్పటికే రుజువైంది. ధూమపానం మానేయడం వల్ల గుండెపోటు ముప్పు తగ్గుతుందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. మీకు అలాంటి ప్రమాద భయం ఉంటే ఈ రోజు ఈ చెడు వ్యసనాన్ని వదలండి. న్యూయార్క్‌లోని ప్రెస్‌బిటేరియన్ హాస్పిటల్, వెయిల్ కార్నెల్ మెడికల్ కాలేజీలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కార్డియోవాస్కులర్ ఇమేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రాబర్ట్ జె.మిన్ మాట్లాడుతూ.. ధూమపానం (స్మోకింగ్) గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుందని చెప్పారు. ధూమపానం మానేయడం వల్ల హృదయ సంబంధ వ్యాధులు తగ్గుతాయని తెలిపారు.

ఈ అధ్యయనంలో ఐరోపాలోని 9 దేశాలకు చెందిన 13,372 మంది హృద్రోగులు ఉన్నారు. రోగులలో 2,853 మంది ధూమపానం, 3,175 మంది ధూమపానం మానేసినవారు, 7,344 మంది ఎప్పుడూ ధూమపానం చేయనివారు ఉన్నారు. పరిశోధన ప్రారంభించిన రెండేళ్ల తర్వాత సర్వేలో పాల్గొన్న వారిలో 2.1 శాతం మంది గుండెపోటుతో మరణించినట్లు తేలింది.

Tags:    

Similar News