Health Tips: గర్భిణులు ఈ ఆహారాలకు దూరంగా ఉండాలి.. లేదంటే చాలా ప్రమాదం..!

Pregnant women: జీవితంలో తల్లి కావాలని ప్రతి మహిళ కోరుకుంటుంది. కానీ ఇందుకోసం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రెగ్నెంట్‌ అయినప్పటి నుంచి తొమ్మిది నెలలు ప్రతి విషయంలో ఆచితూచి వ్యవహరించాలి.

Update: 2024-03-21 14:00 GMT

Health Tips: గర్భిణులు ఈ ఆహారాలకు దూరంగా ఉండాలి.. లేదంటే చాలా ప్రమాదం..!

Pregnant women: జీవితంలో తల్లి కావాలని ప్రతి మహిళ కోరుకుంటుంది. కానీ ఇందుకోసం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రెగ్నెంట్‌ అయినప్పటి నుంచి తొమ్మిది నెలలు ప్రతి విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. ముఖ్యంగా గర్భిణులు డైట్‌ విషయంలో కొన్ని నియమాలను పాటించాలి. కొన్ని రకాల ఆహారాలకు కచ్చితంగా దూరంగా ఉండాలి. లేదంటే పుట్టబోయే బిడ్డకు చాలా ప్రమాదకరం. బర్గర్‌లు, చీజ్‌లు, పిజ్జాలు, ఫాస్ట్‌ఫుడ్స్‌, ఫ్రైస్‌ వంటి వాటికి దూరంగా ఉండాలి. అతిగా ప్రాసెస్‌ చేసిన ఆహార పదార్థాలు గర్భిణీలకు ప్రమాదకరం.

ఆహారాన్ని ప్యాక్‌ చేసే కవర్‌లు, ఆహారం తయారీ, ప్యాకింగ్‌ సందర్భంగా ఫుడ్‌ స్టాల్స్‌ సిబ్బంది వాడే గ్లోవ్స్‌ ఆహారంలోకి కెమికల్స్‌ను వదులుతాయని పరిశోధకులు గుర్తించారు. గర్భిణీలు ఇలాంటి ఆహారం తీసుకున్నప్పుడు ఆ రసాయనాలు రక్త ప్రవాహంలోకి తర్వాత ప్లసెంటా ద్వారా పిండం రక్తప్రవాహంలోకి ప్రవేశిస్తాయి. దీంతో పిల్లలు తక్కువ బరువుతో జన్మించడం, నెలలు నిండకముందే పుట్టడం, అదేవిధంగా ఆటిజం, ADHD లాంటి మానసిక రుగ్మతలతో జన్మించే ప్రమాదం ఉందని చెబుతున్నారు.

గర్భిణీలు అతిగా ప్రాసెస్‌ చేసిన ఆహారం తీసుకుంటే రక్తంలోకి చేరే రసాయనాలు గర్భస్థ శిశువుకు ప్రమాదకరం. 2006 నుంచి 2011 వరకు పేర్లు నమోదు చేసుకున్న 1031 మంది గర్భిణీలపై ఒక పరిశోధన చేశారు. అతిగా ప్రాసెస్‌ చేసిన ఆహారం తీసుకున్న గర్భిణీల యూరిన్‌ శాంపిల్స్‌ ద్వారా వారి రక్తంలో కెమికల్స్ చేరినట్లు గుర్తించారు. పరిశోధనలో పాల్గొన్న గర్భిణీలకు 10 శాతం నుంచి 60 శాతం వరకు మోతాదుల్లో అతిగా ప్రాసెస్‌ చేసిన ఆహారం అందించారు. వారిలో ప్రతి 10 శాతం అల్ట్రా ప్రాసెస్డ్‌ ఫుడ్‌కు 13 శాతం చొప్పున 2ఇథైల్‌ హెక్సైల్‌ అనే కెమికల్ పెరగడాన్ని గమనించారు.

Tags:    

Similar News