Spinach: బచ్చలికూర మంచిదే కానీ ఈ వ్యాధులు ఉన్నవారు తినకూడదు.. ఎందుకంటే..?

Spinach: బచ్చలికూర మంచిదే కానీ ఈ వ్యాధులు ఉన్నవారు తినకూడదు.. ఎందుకంటే..?

Update: 2022-02-11 10:30 GMT

Spinach: బచ్చలికూర మంచిదే కానీ ఈ వ్యాధులు ఉన్నవారు తినకూడదు.. ఎందుకంటే..?

Spinach: బచ్చలికూర ఇదొక ఆకుకూర. పప్పులో వేసి వండితే ఆ రుచికి బానిసగా మారిపోతారు. బచ్చలికూరతో బోలెడు లాభాలున్నాయి. ఇందులో పోషకాలకి కొదువలేదు. శీతాకాలంలో బచ్చలికూర తింటే రోగనిరోధక శక్తి పెంచుకోవచ్చు. మటన్‌, చికెన్‌లకి ఏ మాత్రం తీసిపోదు. ముఖ్యంగా వెజిటేరియన్స్‌కి కావలసిన అన్ని పోషకాలు ఇందులో ఉంటాయి. బచ్చలికూరలో ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు, కాల్షియం, లక్షణాలు ఉంటాయి. ఇవి ఎముకలని దృఢంగా చేస్తాయి. కానీ కొన్ని వ్యాధులు ఉన్నవారు బచ్చలికూర అస్సలు తినకూడదు. చాలా నష్టం జరుగుతుంది. అవేంటో చూద్దాం.

కిడ్నీ సమస్యలు ఉన్నవారు బ‌చ్చలికూర తినకూడదు. ఎందుకంటే ఇది శరీరంలో ఆక్సాలిక్ యాసిడ్ పరిమాణం పెంచుతుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇది మూత్రపిండాలకు మంచిది కాదు. కాల్షియం ఆక్సలేట్ మూత్రపిండంలో నిక్షిప్తమవుతుంది. దీనివల్ల అనేక వ్యాధులకు కారణం అవుతుంది. బచ్చలికూరలో ప్యూరిన్ సమృద్ధిగా ఉంటుంది. ఇది ఒక రకమైన రసాయనం. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఆక్సాలిక్ యాసిడ్, ప్యూరిన్ కలిసి ఆర్థరైటిస్‌కు కారణం అవుతాయి. కీళ్ల నొప్పులతో బాధపడేవారు బచ్చలికూరను తినకూడదని సలహా ఇస్తారు. ఎందుకంటే నొప్పులు మరింత పెరుగుతాయి.

రక్తాన్ని పలుచన చేసే మందులు వాడుతున్నవారు కూడా బచ్చలికూర తినకూడదు. నివేదికల ప్రకారం బచ్చలికూరలో విటమిన్ ఎ సమృద్ధిగా ఉంటుంది. విటమిన్ ఎ ఈ మందులతో కలిసి రియాక్ట్ అవుతుంది. అందుకే తినకూడదు. బచ్చలికూరను కడిగిన తర్వాత కూడా సరిగ్గా శుభ్రం కాదు. ఎందుకంటే నేలలో ఉండే క్రిమి, కీటకాలు కొన్ని అందులోనే ఉండిపోతాయి. క్రమంగా అవి రాళ్లు ఏర్పడటానికి కారణమవుతాయి. 

Tags:    

Similar News