Milk: ఈ వ్యాధులు ఉన్నవారు రాత్రిపూట పాలు తాగకూడదు..!

Milk: పాలు సంపూర్ణ ఆహారం. ఆవుపాలు ఇంకా శ్రేష్టమైనవి. ఆయుర్వేదం ప్రకారం రాత్రిపూట పాలు తాగితే మంచిది.

Update: 2022-02-28 11:30 GMT

Milk: ఈ వ్యాధులు ఉన్నవారు రాత్రిపూట పాలు తాగకూడదు..!

Milk: పాలు సంపూర్ణ ఆహారం. ఆవుపాలు ఇంకా శ్రేష్టమైనవి. ఆయుర్వేదం ప్రకారం రాత్రిపూట పాలు తాగితే మంచిది. ఎందుకంటే పాలలో నిద్రను కలిగించే గుణాలు ఉంటాయి. ఇవి అంత తొందరగా జీర్ణం కావు. దీని కారణంగా ఉదయం తాగాలని చెప్పలేదు. శాస్త్రీయ పరిశోధన గురించి మాట్లాడినట్లయితే పాలు ఎప్పుడైనా తాగవచ్చు. ఇవి మీ ఆరోగ్యం, జీర్ణవ్యవస్థపై ఆధారపడి ఉంటుంది. పాలవల్ల కలిగే లాభాలు, నష్టాల గురించి తెలుసుకుందాం.

పాలలో అనేక పోషకాలు ఉంటాయి. వీటిని అల్పాహారంలో చేర్చుకుంటే అనేక విధాలుగా ప్రయోజనాలను పొందవచ్చు. పాలు మీ ఎముకలను బలంగా చేస్తుంది. కాల్షియం, పొటాషియం, ఫాస్పరస్, మెగ్నీషియం, ప్రోటీన్లు, విటమిన్లు వంటి అనేక పోషకాలు ఇందులో ఉంటాయి. అయితే పాలు అంత తొందరగా జీర్ణం కావు. ఈ పరిస్థితిలో జీర్ణవ్యవస్థ బలహీనంగా ఉన్నవారు ఉదయం పాలు తాగితే రోజు మొత్తం కడుపు సమస్యలతో బాధపడుతారు.

రాత్రి పాలు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు

మీరు రాత్రి పడుకునే ముందు పాలు తాగితే కడుపు రాత్రంతా నిండుగా ఉంటుంది. మీకు ఆకలి అనిపించదు. ఆయుర్వేదం ప్రకారం రాత్రిపూట గోరువెచ్చని పాలు తాగడం వల్ల మనస్సు రిలాక్స్‌గా ఉంటుంది. శరీర కండరాలు కూడా రిలాక్స్ అవుతాయి. కానీ లాక్టోస్ అసహనం ఉన్నవారు తాగకూడదు. ఎందుకంటే పాలు అంత త్వరగా వారికి జీర్ణంకావు. అప్పుడు రాత్రి మొత్తం ఇబ్బంది పడాల్సి ఉంటుంది. అంతే కాదు మధుమేహం ఉన్నవారు కూడా రాత్రిపూట వైద్యుల సలహా తర్వాతే పాలు తీసుకుంటే మంచిది.

Tags:    

Similar News