Health Tips: ఆరోగ్యానికి ఆయిల్‌ కూడా అవసరమే.. కానీ ఎలాంటి ఆయిల్‌ వాడాలంటే..?

Health Tips: ఆరోగ్యానికి ఆయిల్‌ కూడా అవసరమే. కానీ చాలామంది ఈ విషయం తెలియక మొత్తమే ఆయిల్ తీసుకోవడం మానేస్తారు.

Update: 2022-07-06 02:30 GMT

Health Tips: ఆరోగ్యానికి ఆయిల్‌ కూడా అవసరమే.. కానీ ఎలాంటి ఆయిల్‌ వాడాలంటే..? 

Health Tips: ఆరోగ్యానికి ఆయిల్‌ కూడా అవసరమే. కానీ చాలామంది ఈ విషయం తెలియక మొత్తమే ఆయిల్ తీసుకోవడం మానేస్తారు. ఇది మంచి పద్దతి కాదు. అయితే ఏ నూనె ఆరోగ్యానికి మంచిది.. ఏది చెడ్డది.. అలాగే నూనె ఎంత మోతాదులో తీసుకోవాలి.. ఎక్కువగా తీసుకుంటే ఏం జరుగుతుంది.. తదితర విషయాలపై అవగాహన కలిగి ఉండాలి. మన శరీరం ఒమేగా 3ని స్వయంగా ఉత్పత్తి చేయదు. ఈ పరిస్థితిలో మీరు ఒమేగా 3 ఉన్న నూనెను తీసుకోవడం ముఖ్యం. నూనెలో ఉండే మంచి కొవ్వు మన ఆరోగ్యానికి అవసరం. అయితే ఎక్కువ తీసుకోవడం మాత్రం మంచిది కాదు. కాబట్టి ఎల్లప్పుడూ పరిమాణాన్ని జాగ్రత్తగా పరిశీలించాలి. నూనెకి సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకుందాం.

కొబ్బరి నూనె

కొబ్బరి నూనెలో ఉండే కొవ్వు శరీరానికి మేలు చేస్తుంది. నిజానికి ఇది జీవక్రియను పెంచడంలో సహాయపడుతుంది. దీని వల్ల మనకు చాలా సేపు ఆకలి అనిపించదు. కొబ్బరి నూనె కొలెస్ట్రాల్ స్థాయిలను మెరుగుపరుస్తుంది. హానికరమైన బ్యాక్టీరియాను చంపడంలో సహాయపడుతుంది. మీరు ప్రతిరోజూ 2 టీస్పూన్ల కొబ్బరి నూనెను తీసుకోవచ్చు.

రైస్ బ్రాన్ ఆయిల్

ఈ నూనెలో ఉండే విటమిన్ ఈ కాంప్లెక్స్ మన శరీరంలో ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటానికి సహాయపడుతుంది. కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుతుంది. మీరు ఈ నూనెను వంట కోసం ఉపయోగించవచ్చు. అదే సమయంలో ఈ నూనె 3 టీస్పూన్ల వరకు ప్రతిరోజూ తినవచ్చు.

ఆలివ్ నూనె

ఈ నూనె గుండె ఆరోగ్యానికి మంచిదని భావిస్తారు. ఈ నూనె పిల్లల నుంచి పెద్దల వరకు చాలా మంచిదని చెప్పవచ్చు. ఈ నూనెను తీసుకోవడం వల్ల మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. అదే సమయంలో హానికరమైన కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది. మీరు ఈ నూనెను రోజుకు 3 టీస్పూన్ల వరకు తీసుకోవచ్చు. డీప్ ఫ్రై చేయడానికి ఎప్పుడూ ఆలివ్ నూనెను ఉపయోగించవద్దు.

నువ్వుల నూనె

ఈ నూనెలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది డయాబెటిక్ రోగులకు మంచిదని భావిస్తారు. ఈ నూనెను తీసుకోవడం వల్ల గుండె జబ్బులు దూరం కావడమే కాకుండా కీళ్ల నొప్పులు తగ్గిస్తుంది. చర్మం, జుట్టుకు మేలు చేస్తుంది. మీరు ఈ నూనెను రోజుకు 3 టీస్పూన్ల వరకు తీసుకోవచ్చు.

Tags:    

Similar News