Obesity: పిల్లల్లో ఊబకాయం చాలా ప్రమాదం.. మధుమేహం, గుండెజబ్బులు వచ్చే అవకాశం..!

Obesity: పిల్లల్లో ఊబకాయం చాలా ప్రమాదం.. మధుమేహం, గుండెజబ్బులు వచ్చే అవకాశం..!

Update: 2022-02-16 10:09 GMT

Obesity: పిల్లల్లో ఊబకాయం చాలా ప్రమాదం.. మధుమేహం, గుండెజబ్బులు వచ్చే అవకాశం..!

Obesity: కరోనా మహమ్మారి కారణంగా పిల్లల చదువులు దెబ్బతిన్నాయి. మరోవైపు శారీరక, మానసిక ఆరోగ్యం కూడా దెబ్బతింది. శారీరక శ్రమ లేకపోవడం, ఎక్కువ సమయం ఇంట్లో కూర్చోవడం వల్ల పిల్లల్లో ఊబకాయం విపరీతంగా పెరిగింది. దీని వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉందని సర్వేలో తేలింది. అలాగే ఇలాంటి పిల్లల్లో మధుమేహం వచ్చే ప్రమాదం కూడా ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం ఊబకాయం అనేది మన శరీరంలో అదనపు కొవ్వు పేరుకుపోయే వ్యాధి.

ఊబకాయంతో బాధపడుతున్న పిల్లల సంఖ్య 3.4%కి పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా సుమారు రెండు బిలియన్ల మంది పిల్లలు ఊబకాయంతో బాధపడుతున్నారని అంచనా. పిల్లల ఊబకాయం త్వరలో అంటువ్యాధిగా మారుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇది గుండె జబ్బులు మరియు టైప్-2 మధుమేహం వంటి అనేక తీవ్రమైన వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. ఈ వ్యాధులు స్థూలకాయ పిల్లలను కూడా బాధితులుగా మారుస్తున్నాయి. నవంబర్ 2021లో విడుదలైన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-5 నివేదిక ప్రకారం ఐదేళ్లలోపు పిల్లల్లో ఊబకాయం పెరిగింది.

ఆహారం విషయంలో పిల్లలని కంట్రోల్ చేస్తూ ఉండాలి. ప్రస్తుతం పిల్లలు జంక్‌ఫుడ్‌ని ఎక్కువ ఇష్టపడుతున్నారు. దీనివల్ల కేలరీలు పెరిగిపోయి ఊబకాయానికి దారి తీస్తుంది. మరికొంతమంది పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. సన్నగా, బరువు తక్కువగా ఉంటున్నారు. ఇలాంటి పిల్లలని వెంటనే వైద్యడి వద్దకు తీసుకెళ్లాలి. సరైన డైట్ మెయింటెన్‌ చేయాలి. జంక్‌ఫుడ్, వేయించిన ఆహారాలకి దూరంగా ఉంచాలి.

Tags:    

Similar News