Sore Throat: గొంతునొప్పికి 8 కారణాలు.. ఇలా నివారించండి..!

Sore Throat: గొంతునొప్పికి 8 కారణాలు.. ఇలా నివారించండి..!

Update: 2022-10-02 15:30 GMT

Sore Throat: గొంతునొప్పికి 8 కారణాలు.. ఇలా నివారించండి..!

Sore Throat: వాతావరణం మారడంతో అనేక రకాల సమస్యలు శరీరాన్ని తట్టిలేపుతాయి. ఈ సమస్యలలో గొంతు సమస్య సర్వసాధారణం. కాలానుగుణంగా గొంతునొప్పి, దురద, అలర్జీ, రావడం సహజమే. ఎండాకాలంలో చల్లదనం, పులుపు కారణంగా గొంతునొప్పి వస్తుంది. వర్షకాలంలో జలుబు, దగ్గు వల్ల గొంతునొప్పి ఎదురవుతుంది. ఇలా కాకుండా అనేక కారణాల వల్ల కూడా గొంతునొప్పి వస్తుంది. ఈ రోజు వాటి గురించి తెలుసుకుందాం.

కారణాలు..

1. ఆహార అలెర్జీలతో బాధపడేవారికి గొంతు నొప్పి వస్తుంది.

2. డ్రగ్ ఎలర్జీతో బాధపడుతున్నట్లయితే గొంతు సమస్య వస్తుంది.

3. బ్యాక్టీరియా లేదా వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల గొంతు నొప్పి వస్తుంది.

4. డీహైడ్రేషన్‌ వల్ల గొంతునొప్పి వస్తుంది.

5. ఆమ్ల ఆహారాలు తీసుకోవడం వల్ల గొంతు నొప్పి వస్తుంది.

6. సీజన్ ప్రకారం తప్పుడు ఆహారం తీసుకోవడం వల్ల గొంతు నొప్పి వస్తుంది.

7. చల్లటి పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల గొంతు నొప్పి సమస్య వస్తుంది.

గొంతు నొప్పి ఉంటే ఏం చేయాలి..

మీకు గొంతు నొప్పి ఉంటే ముందుగా ఉప్పు నీటితో పుక్కిలించాలి. ఇది మీకు చాలా ఉపశమనాన్ని కలిగిస్తుంది. తేనె, మిరియాలు కలిపి తీసుకుంటే గొంతు నొప్పి సమస్య తగ్గుతుంది. అల్లం టీ తాగడం వల్ల గొంతు నొప్పి తగ్గుతుంది. పసుపు టీ, పసుపు పాలు తాగడం వల్ల గొంతు నొప్పి తగ్గుతుంది. లవంగం తీసుకోవడం వల్ల కూడా గొంతు నొప్పి తగ్గుతుంది.

Tags:    

Similar News