Anemia: శరీరంలో రక్తం తగ్గిందా? వీటితో సమస్య ఫసక్

Foods to overcome Anemia problem: రక్తహీనతను చెక్ పెట్టడంలో దానిమ్మ పండ్లు కీలక పాత్ర పోషిస్తాయి. వీటితో శరీరంలో రక్తం అధికంగా తయారవుతుంది. దానిమ్మ పండ్లతో శరీరంలో రక్త సరఫరా మెరుగవుతుంది. రక్తహీనత సమస్యకు తోటకూర కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది.

Update: 2025-01-25 16:02 GMT

శరీరంలో రక్తం తగ్గిందా? వీటితో సమస్య ఫసక్

Foods to overcome Anemia problem: ఇటీవల రక్తహీనత సమస్య బారిన పడుతోన్న వారి సంఖ్య భారీగా పెరుగుతోంది. ముఖ్యంగా మహిళల్లో ఈ సమస్య ఎక్కువవుతోంది. దీంతో రక్త హీనత మరెన్నో ఇతర అనారోగ్య సమస్యలకు దారి తీస్తోంది. అయితే రక్తహీనత రావడానికి కారణాల్లో పోషకాహార లోపమే ప్రధాన కారణమని వైద్యులు చెబుతున్నారు. రక్తహీనత సమస్య నుంచి బయటపడాలంటే తీసుకునే ఆహరంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఆ జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

రక్తహీనత సమస్యకు చెక్ పెట్టడంలో పాలకూర జ్యూస్ కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. పాలకూరతో తయారు చేసిన జ్యూస్‌ని 30ML మోతాదులో క్రమం తప్పకుండా తీసుకుంటే మంచి ఫలితం ఉంటుందని పౌష్టికాహార నిపుణులు సూచిస్తున్నారు.

పాలకూరలో ఐరన్ సమృద్ధిగా ఉంటుంది. ఇది శరీరంలో రక్తకణాలు తయారయ్యేలా చేస్తుంది. దీంతో రక్తహీనత నుంచి బయట పడవచ్చు.

బీట్ రూట్ జ్యూస్ కూడా రక్తహీనత సమస్యకు బెస్ట్ ఆప్షన్‌గా చెప్పొచ్చు. రోజూ కొంత మొత్తంలో బీట్రూట్ జ్యూస్ తీసుకుంటే రక్తహీనత సమస్య నుంచి బయటపడొచ్చు. బీట్ రూట్‌లో ఉండే బీటా కెరోటిన్, ఐరన్ రక్తహీనతను దూరం చేస్తుంది.

రక్తహీనతను చెక్ పెట్టడంలో దానిమ్మ పండ్లు కీలక పాత్ర పోషిస్తాయి. వీటితో శరీరంలో రక్తం అధికంగా తయారవుతుంది. దానిమ్మ పండ్లతో శరీరంలో రక్త సరఫరా మెరుగవుతుంది. రక్తహీనత సమస్యకు తోటకూర కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. తోటకూరను కూరగా వండుకుని తినొచ్చు, లేదా జ్యూస్ రూపంలో తీసుకున్నా ప్రయోజనం ఉంటుంది.

రక్తహీనతతో బాధపడే వారికి జున్ను కూడా బాగా ఉపయోగపడుతుంది. ఇందులోని విటమిన్ B12 శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. ఇక పన్నీర్‌తో పాటు ఇతర పాల ఉత్పత్తుల్లోనూ విటమిన్ B12 అధికంగానే ఉంటుంది. ఇది మన శరీరంలో ఎర్ర రక్త కణాలు తయారయ్యేలా చేస్తుంది. దీంతో రక్తహీనత నుంచి బయట పడవచ్చు.

Tags:    

Similar News