Moringa : అమ్మ బాబోయ్.. మునగాకులో ఇన్ని వింతలా? తింటే బాడీ ఐరన్ లా మారిపోద్దా!

Moringa : మన పెరట్లోనే ఉండే మునగాకు అద్భుతమైన ఔషధాల గని అని మీకు తెలుసా? కేవలం 100 గ్రాముల మునగాకులో ఉండే విటమిన్-సి..

Update: 2026-01-10 11:30 GMT

Moringa : అమ్మ బాబోయ్.. మునగాకులో ఇన్ని వింతలా? తింటే బాడీ ఐరన్ లా మారిపోద్దా!

Moringa : మన పెరట్లోనే ఉండే మునగాకు అద్భుతమైన ఔషధాల గని అని మీకు తెలుసా? కేవలం 100 గ్రాముల మునగాకులో ఉండే విటమిన్-సి.. మనం ఎంతో ఇష్టంగా తినే నారింజ పండు కంటే ఏడు రెట్లు ఎక్కువ అంటే మీరు నమ్ముతారా? అవును, ఇది అక్షర సత్యం. ఆయుర్వేదం ప్రకారం మునగాకు వందల రోగాలకు రామబాణంలా పనిచేస్తుంది. సూప్స్, పప్పు, వేపుడు ఇలా ఏ రూపంలో తీసుకున్నా మునగాకు అందించే ఆరోగ్య ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు.

మునగాకును కేవలం ఒక కూరగా చూడకండి, ఇందులో విటమిన్-సి తో పాటు మెగ్నీషియం, విటమిన్-కె, విటమిన్-ఇ పుష్కలంగా ఉంటాయి. ఎవరైనా టైఫాయిడ్ జ్వరంతో బాధపడుతుంటే మునగాకు, మునగ వేర్లను నీళ్లలో మరిగించి తాగితే జ్వరం త్వరగా తగ్గిపోతుంది. అలాగే తరచూ వేధించే తీవ్రమైన తలనొప్పికి మునగాకును మెత్తగా నూరి నుదుటిపై పట్టులా వేసుకుంటే ఉపశమనం లభిస్తుంది.

మునగ చెట్టు ఆకులే కాదు, దాని వేర్లు, కాండం కూడా ఆరోగ్యాన్ని అందిస్తాయి. గొంతు నొప్పి లేదా గొంతులో గరగరగా ఉన్నప్పుడు మునగ కాండంను నీళ్లలో మరిగించి కషాయంలా చేసి పుక్కిలిస్తే నొప్పి తక్షణమే తగ్గుతుంది. గొంతు ఇన్ఫెక్షన్లకు ఇది ఒక అద్భుతమైన ఇంటి వైద్యం.

మునగాకును నీళ్లలో నానబెట్టి లేదా మరిగించి ఆ నీటిని క్రమం తప్పకుండా తీసుకుంటే రక్తంలోని షుగర్ లెవల్స్ అదుపులోకి వస్తాయి. ఒకవేళ మీరు శారీరక బలహీనత లేదా అలసటతో ఇబ్బంది పడుతుంటే, మునగ పూలను ఆకులతో కలిపి మరిగించి తాగితే మంచి శక్తి లభిస్తుంది. ఇది కీళ్ల నొప్పుల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది.

మునగాకు కాలేయం లోపలి ఆరోగ్యాన్ని కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తుంది. అయితే దీన్ని ఆహారంలో భాగం చేసుకునే ముందు ఒకసారి మీ వైద్యుడిని సంప్రదించడం మంచిది. ఏది ఏమైనా మన ఇంట్లోనే దొరికే ఈ మునగను నిర్లక్ష్యం చేయకుండా వాడితే ఆరోగ్యంగా ఉండొచ్చు.

Tags:    

Similar News