Skin Care Tips: వర్షంలో కూడా మెరిసే చర్మం కావాలా? ఈ ఫేస్ ప్యాక్‌లను ప్రయత్నించండి..!
Skin Care Tips: వర్షాకాలం అనేక రకాల చర్మ సమస్యలకు దారితీస్తుంది. ముఖంపై మొటిమలు, దద్దుర్లు ఎక్కువగా వస్తాయి. కాబట్టి, వర్షాకాలంలో చర్మంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం చాలా ముఖ్యం.
Skin Care Tips: వర్షంలో కూడా మెరిసే చర్మం కావాలా? ఈ ఫేస్ ప్యాక్‌లను ప్రయత్నించండి..!
Skin Care Tips: వర్షాకాలం అనేక రకాల చర్మ సమస్యలకు దారితీస్తుంది. ముఖంపై మొటిమలు, దద్దుర్లు ఎక్కువగా వస్తాయి. కాబట్టి, వర్షాకాలంలో చర్మంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం చాలా ముఖ్యం. చర్మాన్ని ఆరోగ్యంగా, మెరుస్తూ ఉంచడంలో ఇంటి నివారణలు చాలా ప్రభావవంతంగా ఉంటాయి. కాబట్టి, ఇంట్లో తయారుచేసిన ఈ చర్మ సంరక్షణ చిట్కాలు మీకు సహాయపడతాయి.
శనగపిండి -పెరుగు ఫేస్ ప్యాక్
వర్షాకాలంలో శనగపిండి పెరుగు ఫేస్ ప్యాక్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దీన్ని అప్లై చేయడం వల్ల చర్మం మెరుస్తూ ఉంటుంది. శనగపిండి పెరుగు ఫేస్ ప్యాక్ తయారు చేయడానికి 1 టీస్పూన్ శనగపిండి, 1 టీస్పూన్ పెరుగు, చిటికెడు పసుపు తీసుకొని బాగా కలపండి. ఇప్పుడు దానిని ముఖానికి అప్లై చేసి 15 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని కడగాలి. ఇలా చేయడం ద్వారా, చర్మం లోపలి నుండి క్లీన్ అవుతుంది. తద్వారా సహజమైన మెరుపు లభిస్తుంది.
కలబంద - వేప జెల్ ప్యాక్
వర్షాకాలంలో చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి కలబంద వేప జెల్ ప్యాక్ సహాయపడుతుంది. వేపలోని యాంటీ బాక్టీరియల్ లక్షణాలు చర్మాన్ని మెరిచేలా చేస్తాయి. 2 టీస్పూన్ల కలబంద జెల్ తీసుకొని, దానికి 1 టీస్పూన్ వేప పొడి వేసి ముఖానికి అప్లై చేయండి. ఇది మొటిమల సమస్యను పరిష్కరిస్తుంది.
రోజ్ వాటర్ - ముల్తానీ మట్టి ప్యాక్
వర్షాకాలంలో చర్మాన్ని బిగుతుగా, జిడ్డు లేకుండా చేయడానికి రోజ్ వాటర్ ముల్తానీ మట్టి ప్యాక్ మంచిగా ఉపయోగపడుతుంది. 2 టీస్పూన్ల ముల్తానీ మట్టిలో రోజ్ వాటర్ కలిపి ముఖానికి అప్లై చేయండి. 15 నిమిషాల తర్వాత ముఖాన్ని సాధారణ నీటితో కడగాలి. ఇది చర్మాన్ని మెరిచేలా చేస్తుంది.
దోసకాయ - తేనె
దోసకాయ , తేనె.. ముఖాన్ని హైడ్రేట్ గా ఉంచడానికి సహాయపడుతుంది. దోసకాయ, తేనెతో ఫేస్ ప్యాక్ తయారు చేయడానికి 1 టీస్పూన్ దోసకాయ రసం తీసుకొని అందులో 1 టీస్పూన్ తేనె కలిపి ముఖానికి అప్లై చేయండి. 10 నిమిషాల తర్వాత, ముఖాన్ని సాధారణ నీటితో కడగాలి. ఇది మీ చర్మాన్ని ప్రకాశించేలా చేస్తుంది.
బియ్యం పిండి- టమోటా రసం
బియ్యం చర్మాన్ని బిగుతుగా, ప్రకాశవంతంగా మార్చడంలో సహాయపడుతుంది. టమోటా రసం టానింగ్‌ను తొలగిస్తుంది. ఈ రెండింటినీ కలపడం ద్వారా, ముఖం మచ్చలు లేకుండా ప్రకాశవంతంగా మారుతుంది. 1 చెంచా బియ్యం పిండి తీసుకొని అందులో 1 చెంచా టమోటా రసం కలిపి ముఖానికి అప్లై చేసి స్క్రబ్ చేసి తర్వాత కడిగేయండి. దీనివల్ల డెడ్ స్కిన్ తొలగిపోయి చర్మం మెరిసిపోతుంది.