Memory Booster Food: మీ పిల్లలు సూపర్ కంప్యూటర్ కంటే వేగంగా మారాలా.. ఈ సూపర్ ఫుడ్స్‌ను డైట్‌లో చేర్చితే సరి..!

Food For Sharp Memory: వయస్సు పెరిగేకొద్దీ పాత విషయాలను నెమ్మదిగా మరచిపోతుంటారు.

Update: 2023-04-17 14:30 GMT

Memory Booster Food: మీ పిల్లలు సూపర్ కంప్యూటర్ కంటే వేగంగా మారాలా.. ఈ సూపర్ ఫుడ్స్‌ను డైట్‌లో చేర్చితే సరి..!

Food For Sharp Memory: వయస్సు పెరిగేకొద్దీ పాత విషయాలను నెమ్మదిగా మరచిపోతుంటారు. ఎందుకంటే వయస్సు పెరుగుతున్న కొద్దీ జ్ఞాపకశక్తి కూడా బలహీనపడుతుంది. జ్ఞాపకశక్తి బలహీనత అనేది వృద్ధులలో సాధారణంగా కనిపిస్తుంది. కానీ, ఈ సమస్య ఇప్పుడు చిన్న పిల్లలలో కనిపిస్తుంది. చాలా మంది పిల్లలు వారి జ్ఞాపకశక్తి బలహీనంగా ఉండడంతో.. మిగిలిన వారి కంటే చాలా వెనుకబడి ఉంటారు.

బలహీనమైన జ్ఞాపకశక్తి కారణంగా, సాధారణ పిల్లల కంటే వెనుకబడి ఉంటుంటారు. దీని కోసం మీరు పిల్లల ఆహారంలో కొన్ని మార్పులు తీసుకురావడం అవసరం. అలాంటి కొన్ని సూపర్ ఫుడ్స్ ఇప్పుడు తెలుసుకుందాం. వీటిని తీసుకోవడం వల్ల పిల్లల మెదడు సూపర్ కంప్యూటర్ లాగా షార్ప్ అవుతుంది. బలహీనమైన జ్ఞాపకశక్తితో పోరాడడంలో బాదం సహాయపడుతుంది. బాదంపప్పును పాలలో కలిపి రోజూ పిల్లలకు ఇస్తే, వారి మెదడు పదునుగా మారుతుంది.

అవోకాడోతో అద్భుతమైన ఫలితాలు..

మొదడుకు పదును పెట్టడానికి అవకాడో మంచి ఎంపిక. అవకాడో తినడం పిల్లల మెదడుపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. ఈ పండులో ఉండే విటమిన్‌ సి, విటమిన్‌ ఇ, ఫోలిక్‌ యాసిడ్‌, పొటాషియం, కాపర్‌, ఐరన్‌, మాంగనీస్‌, విటమిన్‌ బి కాంప్లెక్స్‌ బ్రెయిన్‌ బూస్టర్‌గా పనిచేస్తాయి.

అలాగే మీ పిల్లలు సాధారణ పిల్లల కంటే మానసికంగా వెనుకబడి ఉంటే, వారికి రోజూ ఖాళీ కడుపుతో గుడ్డు ఇవ్వాలి. ఇలా చేయడం వల్ల పిల్లల మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఎందుకంటే గుడ్డులో ఉండే విటమిన్ బి12, విటమిన్ బి6 మెదడు ఆరోగ్యంపై సానుకూల ఫలితాలను కలిగిస్తాయి.

Tags:    

Similar News