Women Health: చాలామంది గర్భిణులకి ఇదే సమస్య.. కారణం ఏంటంటే..?

Women Health: దాదాపు ప్రతి మహిళ తల్లి కావాలని కోరుకుంటుంది.

Update: 2022-10-01 07:00 GMT

Women Health: చాలామంది గర్భిణులకి ఇదే సమస్య.. కారణం ఏంటంటే..?

Women Health: దాదాపు ప్రతి మహిళ తల్లి కావాలని కోరుకుంటుంది. ప్రెగ్నెన్సీ వార్తతో ఇళ్లంతా ఆనందంతో నిండిపోతుంది. కుటుంబ సభ్యులందరు చిరు అతిథి కోసం ఎదురుచూస్తుంటారు. అయితే ఈ సమయంలో గర్భిణులు జాగ్రత్తగా ఉండాలి. ప్రెగ్నెన్సీ సమయంలో అనేక రకాల ఇబ్బందులు ఉంటాయని అందరికి తెలుసు. వాటిని నెమ్మదిగా అధిగమించాలి. లేదంటే పెద్ద సమస్యగా మారుతాయి. అటువంటి కొన్ని సమస్యలు, పరిష్కారాల గురించి తెలుసుకుందాం.

1. వికారము

గర్భం దాల్చిన మొదటి త్రైమాసికంలో మార్నింగ్ సిక్ నెస్ సమస్య ఏర్పడుతుంది. అంటే ఉదయాన్నే వచ్చే వాంతులు, వికారం. దీనికి కారణం తెలియదు కానీ ఈస్ట్రోజెన్ హార్మోన్ పెరగడం, గ్యాస్ట్రిక్ సమస్యల వల్ల వస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అయితే దీని నుంచి పుట్టిన బిడ్డకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ గర్భిణీలు ఈ కారణంగా ఆహారం తగ్గించినట్లయితే అప్పుడు సమస్య ఉంటుంది.

ఉదయం నిద్రలేవగానే ఉప్పు లేదా కారంగా ఉండే వాటిని తినాలి. ఇది వికారం నివారించడంలో సహాయపడుతుంది. నిమ్మ లేదా అల్లం, ఏలకుల టీ సువాసన వికారం నుంచి ఉపశమనం కలిగిస్తుంది. వాసన పడని వాటికి దూరంగా ఉండటం మంచిది. రాత్రి పడుకునే ముందు ఆరోగ్యకరమైన స్నాక్స్ తినాలి.

2. గుండెల్లో మంట

ప్రెగ్నెన్సీ సమయంలో పుల్లటి త్రేన్పులతో పాటు ఛాతీలో మండుతుంది. కడుపు నుంచి అన్నవాహికకు ఆమ్లం తిరిగి రావడం వల్ల ఛాతీలో మంట వస్తుంది. గర్భధారణ సమయంలో ఉదరంపై ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల చికాకును తగ్గించే మందులను తీసుకోవద్దు. ఎందుకంటే ఇది మీకు పుట్టబోయే బిడ్డకి ఆస్తమా వ్యాధిని కలిగిస్తుంది.

గుండెల్లో మంటను నివారించడానికి కొన్ని చిట్కాలని పాటించవచ్చు. మీరు పుదీనా ఆకులను తీసుకొని వాటిని కొద్దిగా నల్ల ఉప్పుతో నమలండి. ఒక కప్పు గోరువెచ్చని నీటిలో ఆపిల్ సైడర్ వెనిగర్ మిక్స్ చేసి రోజుకు రెండుసార్లు త్రాగాలి. కెఫిన్, నూనె పదార్థాలకు దూరంగా ఉండాలి. భోజనం చేసిన వెంటనే పడుకోవద్దు. నెమ్మదిగా కొద్దిసేపు నడవాలి.

3. మలబద్ధకం

గర్భధారణ సమయంలో మలబద్ధకం అనేది ఒక సాధారణ సమస్య. ఒక నివేదిక ప్రకారం గర్భధారణ సమయంలో నాల్గవ వంతు మహిళలు మలబద్ధకంతో బాధపడుతున్నారు. మొదటి త్రైమాసికం తర్వాత మలబద్ధకం ఎక్కువగా ఇబ్బంది పెడుతుంది. ఈ పరిస్థితిలో మీరు సమయానికి మలబద్ధకం చికిత్సను ప్రారంభించకపోతే అది పైల్స్‌కి దారితీస్తుంది.

గర్భధారణ సమయంలో మలబద్ధకం నివారించడానికి ఈ చిట్కాలు పాటించాలి. పీచుపదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారాలను ఎక్కువగా తీసుకోవాలి. ఉదాహరణకు పండ్లు, ఆకుపచ్చ కూరగాయలు, డ్రై ఫ్రూట్స్ లాంటివి. తేలికపాటి వ్యాయామం, క్రమం తప్పకుండా వాకింగ్‌ చేయాలి. లిక్విడ్ డైట్‌లో జాగ్రత్త వహించాలి. తగినంత పరిమాణంలో నీరు, పాలు, రసం, సూప్ మొదలైనవి తీసుకుంటూ ఉండాలి.

Tags:    

Similar News