Bad Cholesterol: చెడు కొలస్ట్రాల్‌ పెరగొద్దంటే ఇవి డైట్‌లో ఉండాల్సిందే..!

Bad Cholesterol: చెడు కొలెస్ట్రాల్‌ను సైలెంట్ కిల్లర్ అని పిలుస్తారు. ఇది మన రక్తంలో చేరితే రక్త ప్రసరణకు ఆటంకం ఏర్పడుతుంది.

Update: 2022-08-24 09:24 GMT

Bad Cholesterol: చెడు కొలస్ట్రాల్‌ పెరగొద్దంటే ఇవి డైట్‌లో ఉండాల్సిందే..!

Bad Cholesterol: చెడు కొలెస్ట్రాల్‌ను సైలెంట్ కిల్లర్ అని పిలుస్తారు. ఇది మన రక్తంలో చేరితే రక్త ప్రసరణకు ఆటంకం ఏర్పడుతుంది. ఈ పరిస్థితిలో అధిక రక్తపోటు ప్రారంభమవుతుంది. ఇది ఊబకాయం, గుండెపోటు, మధుమేహం వంటి వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. మీరు మీ రోజువారీ ఆహారంలో మార్పు చేస్తే అది అధిక కొలెస్ట్రాల్‌ను చాలా వరకు నియంత్రిస్తుంది. అది ఎలాగో తెలుసుకుందాం.

1.గ్రీన్ టీ

ప్రతిరోజు సాధారణ టీ తాగే బదులు గ్రీన్‌ టీ తాగే విధంగా అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే ఇది ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. బరువు తగ్గడానికి సహాయపడుతుంది. చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది.

2.పండ్లు,కూరగాయలు

భారతదేశంతో సహా అనేక ప్రదేశాలలో కొవ్వు ఆహారాలు తినే ధోరణి చాలా మందిలో ఎక్కువగా ఉంది. ఇందులో ప్రమాదకరమైన సంతృప్త కొవ్వులు ఉంటాయి. ఇవి ఆరోగ్యాన్ని పాడుచేస్తాయి.ఈ పరిస్థితిలో మీరు ఆరోగ్యకరమైన ఆహారాన్ని మాత్రమే తినడం అలవాటు చేసుకోవాలి. మీ రోజువారీ ఆహారంలో తాజా పండ్లు, కూరగాయలను తీసుకోవడం మంచిది. ఎందుకంటే వాటిలో కరిగే ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడతాయి.

3.సోయాబీన్స్

రక్తంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గించడానికి మీరు ప్రోటీన్ తీసుకోవడం పెంచాలి. దీని కోసం మీరు రోజువారీ ఆహారంలో సోయాబీన్లను చేర్చాలి. ఇందులో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.

4.మసాలా దినుసులు

కొలెస్ట్రాల్ తగ్గాలంటే హెల్తీ ఫుడ్ తీసుకోవడం పెంచినా మసాలాలు తీసుకోవడం మాత్రం తగ్గించకూడదు. పసుపు, అల్లం, దాల్చినచెక్క, వెల్లుల్లి వంటి సుగంధ ద్రవ్యాలు బాగా ఉపయోగపడతాయి. ఎందుకంటే అవి ఆయుర్వేద లక్షణాలతో సమృద్ధిగా ఉంటాయి. ఇవి సిరల్లో చెడు కొలస్ట్రాల్‌ని తగ్గించడానికి సహాయపడుతాయి.

Tags:    

Similar News