Dates Chutney: ఖర్జూరతో చట్నీ తయారీ.. సూపర్‌ టేస్ట్.. ఎలా చేయాలంటే..?

Dates Chutney: చలికాలంలో ఖర్జూర తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో చాలా పోషకాలు ఉంటాయి...

Update: 2022-01-05 08:00 GMT

Dates Chutney: ఖర్జూరతో చట్నీ తయారీ.. సూపర్‌ టేస్ట్.. ఎలా చేయాలంటే..?

Dates Chutney: చలికాలంలో ఖర్జూర తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో చాలా పోషకాలు ఉంటాయి. ఇది శరీరాన్ని వెచ్చగా ఉంచుతుంది. ఖర్జూరని ఆయుర్వేదంలో కూడా విరివిగా వాడుతారు. అయితే ఖర్జూర అంటే కొంతమంది ఇష్టపడుతారు మరికొంతమందికి ఇష్టం ఉండదు. ఈ పరిస్థితిలో ఇందులో ఉండే పోషకాలు లభించాలంటే వీటిని చట్నీ ద్వారా కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఖర్జూర చట్నీ ఎలా తయారుచేయాలో చూద్దాం.

ఖర్జూరం చట్నీకి కావలసిన పదార్థాలు: ఖర్జూరం - 100 గ్రాములు, ఎర్ర కారం - 1/2 tsp, జీలకర్ర పొడి - 1/2 tsp, బ్లాక్ సాల్ట్ - 1/2 tsp, డ్రై ఫ్రూట్స్ - 2 tsp, ఉప్పు - రుచి ప్రకారం ఉంటే చాలు.

తయారు చేసే విధానం: ఖర్జూర చట్నీ తయారు చేయడానికి ముందుగా ఖర్జూరం నుంచి గింజలను బాగా తీసి మూడు కప్పుల నీటిలో సుమారు 2 గంటల పాటు నానబెట్టాలి. తరువాత ఖర్జూరాలను అందులో నుంచి తీసి ఒక పాత్రలో వేసి బాగా ఉడికించాలి. తర్వాత మిక్సీలో వేసి బాగా గ్రైండ్ చేయాలి. తర్వాత కారం, ఎండుమిర్చి, జీలకర్ర పొడి వంటివి వేసి కాసేపు మళ్లీ ఉడికించాలి. ఇప్పుడు అందులో డ్రై ఫ్రూట్స్, వైట్ సాల్ట్ వేసి కలపాలి. అంతే వేడి వేడి ఖర్జూర చట్నీ తయారై పోతుంది.

Tags:    

Similar News