Lifestyle Tips: కొత్త బట్టలు వెంటనే వేసుకుంటున్నారా? ఇది మీ ఆరోగ్యానికి ప్రమాదకరం కావచ్చు!

Lifestyle Tips: కొత్త బట్టలు అంటే ప్రతి ఒక్కరికీ ఆనందమే. కొత్త దుస్తులు తీసుకున్నప్పుడల్లా మనం వెంటనే దానిని ధరించాలని భావిస్తాం. కానీ, కొత్త బట్టలను వాష్ చేయకుండా ఉతకడం మంచిది కాదు.

Update: 2025-06-25 12:27 GMT

Lifestyle Tips: కొత్త బట్టలు వెంటనే వేసుకుంటున్నారా? ఇది మీ ఆరోగ్యానికి ప్రమాదకరం కావచ్చు!

Lifestyle Tips: కొత్త బట్టలు అంటే ప్రతి ఒక్కరికీ ఆనందమే. కొత్త దుస్తులు తీసుకున్నప్పుడల్లా మనం వెంటనే దానిని ధరించాలని భావిస్తాం. కానీ, కొత్త బట్టలను వాష్ చేయకుండా ఉతకడం మంచిది కాదు. ఎందుకంటే, కొత్త బట్టలను వెంటనే ఉతకకుండా ధరించడం ఆరోగ్యానికి హానికరం. కొత్త బట్టలు దుమ్ము, బ్యాక్టీరియా, రసాయనాలతో కలుషితమయ్యే అవకాశం ఉంది. ఇవి చర్మ వ్యాధులు లేదా ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చు. కాబట్టి, కొత్త బట్టలను ధరించే ముందు కనీసం ఒకసారైనా ఉతకడం మంచిది.

చాలామంది షాపింగ్ చేసి కొత్త బట్టలు వేసేసుకుంటారు. కానీ దీని వల్ల చర్మ సంబంధిత ఇబ్బందులు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆన్‌లైన్‌ ద్వారా కొనుగోలు చేసిన దుస్తులు లేదా షోరూమ్‌లో ట్రయల్‌కు పెట్టిన బట్టలు ఇప్పటికే మరొకరు వేసినవై ఉండవచ్చు. ఆ బట్టలపై ఆ వ్యక్తుల చెమట, ధూళి, బ్యాక్టీరియా ఉండే అవకాశం ఉంది. మనం అవి నేరుగా వేసుకుంటే, చర్మానికి ఇన్‌ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంటుంది.

కొత్త బట్టల తయారీలో వేసే రంగులు, మృదుత్వం కోసం వాడే కెమికల్స్ మన ఆరోగ్యానికి హానికరం కావచ్చు. ముఖ్యంగా ఫార్మాల్డిహైడ్, అలెర్జీ కలిగించే డైస్, బ్యాక్టీరియాకు అనుకూలమైన తడి పదార్థాలు. ఈ రసాయనాలు శ్వాస సంబంధిత సమస్యలు, దురదలు వంటి ఆరోగ్యపరమైన సమస్యలు కలిగించే అవకాశం ఉంది. దుస్తులు మృదువుగా, కొత్తగా కనిపించేందుకు ఉపయోగించే ఈ కెమికల్స్ మన శరీరానికి తెలియకుండా తాకుతూ ప్రభావం చూపిస్తాయి.

పిల్లలు, గర్భిణులకు ప్రత్యేక జాగ్రత్తలు అవసరం

చిన్న పిల్లల చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. కొత్త బట్టలపై ఉండే రసాయనాలు లేదా బ్యాక్టీరియా వారికి వెంటనే రియాక్షన్‌ ఇవ్వొచ్చు. మొలస్కం వంటి వైరల్ ఇన్ఫెక్షన్లు పిల్లల్లో వేగంగా వ్యాపించవచ్చు. అలాగే, గర్భిణీ స్త్రీల్లో రోగనిరోధక శక్తి తక్కువగా ఉండటం వల్ల ఈ రసాయనాల వల్ల తేలికపాటి ఇన్ఫెక్షన్‌లు కూడా ప్రమాదకరంగా మారే అవకాశముంది.

ఏం చేయాలి?

కొత్త బట్టలు కొనుగోలు చేసిన వెంటనే వాటిని ఉతకండి.

గోరువెచ్చని నీటిలో వాష్ చేయడం వల్ల కెమికల్స్ తొలగిపోతాయి.

చిన్న పిల్లల బట్టల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోండి.

షోరూమ్ ట్రయల్స్ చేసిన తర్వాత స్నానం చేయడం మంచిది.

Tags:    

Similar News