Sleeping Position : కుడివైపా లేదా ఎడమవైపా.. ఎటు తిరిగి పడుకుంటే ఆరోగ్యానికి మంచిది
మనం నిద్రపోయే విధానం కూడా మన ఆరోగ్యంపై ముఖ్యంగా జీర్ణవ్యవస్థపై ఎంతగానో ప్రభావం చూపుతుందని చాలామందికి తెలియదు.
Sleeping Position : కుడివైపా లేదా ఎడమవైపా.. ఎటు తిరిగి పడుకుంటే ఆరోగ్యానికి మంచిది
Sleeping Position : మనం నిద్రపోయే విధానం కూడా మన ఆరోగ్యంపై ముఖ్యంగా జీర్ణవ్యవస్థపై ఎంతగానో ప్రభావం చూపుతుందని చాలామందికి తెలియదు. కొంతమంది ఎడమవైపు తిరిగి పడుకుంటే, మరికొంతమంది కుడివైపు తిరిగి పడుకుంటారు. ఇంకొందరు వెల్లకిలా పడుకోవడానికి ఇష్టపడతారు. సౌకర్యంగా ఉందని ఏ భంగిమలో పడుకున్నా, అది సరైనది కాకపోతే రకరకాల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అదే సరైన పద్ధతిలో పడుకుంటే, జీర్ణ సమస్యలతో సహా అనేక అనారోగ్యాలను నివారించవచ్చు. మరి, ఏవైపు తిరిగి పడుకోవడం ఉత్తమం? ఎలాంటి భంగిమలు మన ఆరోగ్యాన్ని కాపాడతాయి అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
శరీరానికి ఆహారం ఎంత ముఖ్యమో, నిద్ర కూడా అంతే ముఖ్యం. రోజంతా చురుకుగా ఉండి పనులన్నీ సక్రమంగా నిర్వహించాలంటే రాత్రిపూట తప్పనిసరిగా మంచి నిద్ర ఉండాలి. అయితే, చాలామంది పడుకునేటప్పుడు వివిధ భంగిమలను అనుసరిస్తారు. ఈ అలవాట్లు కొన్నిసార్లు ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చు. అందుకే, మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సరైన నిద్ర భంగిమ ఏమిటో తెలుసుకోవడం, దాన్ని పాటించడం చాలా అవసరం. పెరిగిన ఒత్తిడి, మారిన ఆహారపు అలవాట్లు మన నిద్రపై ప్రభావం చూపుతున్నందున, మనం మన ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు జాగ్రత్తలు తీసుకోవాలి.
ఎడమవైపు తిరిగి పడుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు
మనం ఎంచుకునే నిద్రించే విధానం ఆరోగ్యంపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా ఎడమవైపు తిరిగి పడుకోవడం వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు లభిస్తాయి.
మెరుగైన జీర్ణక్రియ: ఎడమవైపు తిరిగి పడుకోవడం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మన జీర్ణాశయం ఎడమవైపు ఉండటం వల్ల, ఈ భంగిమలో పడుకోవడం ఆహారం సులభంగా చిన్న ప్రేగులోకి వెళ్లడానికి సహాయపడుతుంది.
గుండెకు మేలు : ఎడమవైపు తిరిగి పడుకోవడం మన గుండెకు చాలా మంచిది. గుండె శరీరంలో ఎడమవైపు ఉంటుంది కాబట్టి, ఈ భంగిమలో పడుకోవడం వల్ల గుండెకు రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ఇది గుండెపై ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది.
నొప్పి నివారణ : ఎక్కువసేపు కూర్చుని పనిచేసే వారికి తరచుగా వెన్నునొప్పి వంటి సమస్యలు వస్తుంటాయి. సరిగా నిద్ర లేకపోతే ఈ నొప్పి మరింత పెరుగుతుంది. ఎడమవైపు తిరిగి పడుకోవడం వల్ల వెన్నునొప్పి నుండి ఉపశమనం పొందవచ్చు.
ఏ భంగిమలు మార్చుకోవాలి?
మీకు కుడివైపు తిరిగి పడుకునే లేదా పొట్టపై పడుకునే అలవాటు ఉంటే, దాన్ని వెంటనే మార్చుకోవడం మంచిది. ఎందుకంటే ఈ భంగిమలు మీ నిద్ర నాణ్యతతో పాటు మీ అంతర్గత అవయవాల పనితీరుపై కూడా ప్రభావం చూపుతాయి. ఎడమవైపు తిరిగి పడుకోవడం పేగుల కదలికలకు కూడా చాలా ప్రయోజనకరం. అందువల్ల, ఎడమవైపు తిరిగి పడుకునే అలవాటును అలవరుచుకుంటే, మీరు మంచి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు.