Panneer: మీకు పన్నీర్ అంటే ఇష్టమా? తెగ లాగించేస్తారా? అయితే ఇది మీకోసమే!

Update: 2021-08-28 16:00 GMT

Panneer: మీకు పన్నీర్ అంటే ఇష్టమా? తెగ లగించేస్టారా? అయితే ఇది మీకోసమే!

Benefits of Paneer: మనలో చాలామందికి పన్నీర్ అంటే చాలా ఇష్టం. ముఖ్యంగా శాకాహారులు పన్నీర్ వంటకాలను ఎక్కువ ఇష్టపడతారు. కొందరు అయితే, ప్రతిరోజూ పన్నీర్ పెట్టినా తినేస్తారు. ఇంకొందరు పచ్చి పన్నీర్ ను కూడా పిచ్చి పిచ్చిగా నమిలేస్తారు. మరి పన్నీర్ ఆరోగ్యానికి మంచిదేనా? తెలుసుకుందాం.

పన్నీర్ ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా పరిగణిస్తారు. అలా అని దానిని ఎక్కువగా తీసుకోమ్మని అర్ధం కాదు. పన్నీర్ అధికంగా తీసుకోవడం వల్ల శరీరం దెబ్బతింటుంది. ఈ రోజు మేము మీకు చెప్పబోయేది ఇదే. మీరు మీ హృదయాన్ని ఆరోగ్యంగా ఉంచాలనుకుంటే.. కొలెస్ట్రాల్‌ను కూడా నియంత్రించాలనుకుంటే, పన్నీర్ తీసుకోవడం తగ్గించండి. పన్నీర్ అధికంగా తీసుకోవడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ మొత్తం పెరుగుతుంది. ఇది కొరోనరీ హార్ట్ డిసీజ్‌కు దారితీస్తుంది.

పన్నీర్లో ఉప్పు ఎక్కువగా ఉన్నందున సోడియం అధికంగా ఉంటుంది. ఫలితంగా, పన్నీర్ అధికంగా తీసుకోవడం వల్ల అధిక రక్తపోటు వస్తుంది. అధిక రక్తపోటు ఉన్నవారు పన్నీర్ పూర్తిగా తినకపోవడం మంచిది.

అసిడిటీతో బాధపడేవారు తక్కువ మోతాదులో పన్నీర్ తినాలి. మీరు తినాలనుకుంటే, రాత్రిపూట తినవద్దు. లేకపోతే, అసిడిటీ, కడుపులో సమస్యలు రావచ్చు. పన్నీర్ ప్రోటీన్ కోసం మంచి వనరుగా పరిగనిస్తారు. అయితే, శరీరంలో ఎక్కువ ప్రోటీన్ అతిసారానికి కారణమవుతుంది. చాలామంది పచ్చి పన్నీర్ తినడానికి కూడా ఇష్టపడతారు. కానీ, ఇది మంచి అలవాటు కాదు. నిజానికి, పచ్చి పన్నీర్ తినడం వల్ల ఇన్ఫెక్షన్లు వస్తాయి.

Tags:    

Similar News