Janhvi Kapoor: జాన్వీ ఎనర్జీ సీక్రెట్ ఇదా.. అసలు విషయం బయటపెట్టిన బ్యూటీ..!
Janhvi Kapoor: అందాల తారల గురించి తెలుసుకోవాలని ప్రతీ ఒక్కరికీ ఉంటుంది. ముఖ్యంగా వారి హెల్త్, బ్యూటీ సీక్రెట్‌ల విషయంలో చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు.
Janhvi Kapoor: జాన్వీ ఎనర్జీ సీక్రెట్ ఇదా.. అసలు విషయం బయటపెట్టిన బ్యూటీ..!
Janhvi Kapoor: అందాల తారల గురించి తెలుసుకోవాలని ప్రతీ ఒక్కరికీ ఉంటుంది. ముఖ్యంగా వారి హెల్త్, బ్యూటీ సీక్రెట్‌ల విషయంలో చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. తాజాగా అందాల తార జాన్వీ కపూర్ తన ఎనర్జీ సీక్రెట్‌ను బయటపెట్టింది. తాను రెగ్యులర్‌గా బ్లాక్ కాఫీని తీసుకుంటానని ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చిందీ చిన్నది. తాను క్రమం తప్పకుండా బ్లాక్ కాఫీని తీసుకుంటానని, అదే తన ఎనర్జీ సీక్రెట్ అని ఈ బ్యూటీ తెలిపింది. ఇంతకీ జాన్వీ తీసుకునే బ్లాక్ కాఫీ వల్ల నిజంగానే ఉపయోగాలు ఉంటాయా.? ఉంటే అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
* బ్లాక్ కాఫీలో ఉండే కెఫీన్ మూడ్‌ని సరిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. దీంతో డిప్రెషన్ వంటి సమస్యలు దూరమవుతాయి.
* పార్కిన్సన్స్ వ్యాధి లాంటి సమస్యలను దూరం చేయడంలో కాఫీ ఎంతో ఉపయోగపడుతుంది. కెఫీన్‌లో నాడీ వ్యవస్థను రక్షించే లక్షణం ఉంటుంది. ఇది నాడీ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. దీంతో అల్జీమర్స్ వంటి వ్యాధులు రాకుండా చేయడంలో సహాయపడుతుంది.
* బ్లాక్ కాఫీ ఎనర్జీ బూస్టర్‌గా పనిచేస్తుంది. దీంతో రోజంతా చురుగ్గా ఉంటారు. ఏకాగ్రత పెరుగుతుంది. ముఖ్యంగా రాత్రుళ్లు వాహనాలు నడిపే వారు బ్లాక్ కాఫీ తీసుకుంటే యాక్టివ్ అవుతారు.
* డయాబెటిస్‌తో బాధపడేవారు బ్లాక్ కాఫీ తీసుకుంటే ఎంతో మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. కాఫీ తాగడం వల్ల ఇన్సులిన్‌కి ప్రేరణ లభిస్తుంది. ఇది టైప్ 2 డయాబెటిస్‌ను రాకుండా అడ్డుకోవడంలో ఉపయోగపడుతుంది.
* లివర్ సమస్యలను దరిచేరకుండా చూసుకోవడంలో కూడా బ్లాక్ టీ ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే మోతాదుకు మించి తీసుకుంటే లివర్ పై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
* రోజూ బ్లాక్ కాఫీ తీసుకుంటే జీర్ణక్రియ మెరుగవుతుంది. దీంతో ఇది పరోక్షంగా బరువు తగ్గడానికి దోహదపడుతుంది. అందుకే బరువు తగ్గాలనుకునే వారు కచ్చితంగా బ్లాక్ కాఫీని తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు
నోట్: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యం విషయంలో వైద్యుల చెప్పే విషయాలనే పాటించాలి.