Health Tips: నేరేడు గింజల పొడితో మధుమేహానికి చెక్.. ఎలాగంటే..?

Health Tips: ఈ కాలంలో నేరేడు పండ్లు బాగా దొరుకుతాయి. దీనివల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు కలుగుతాయి.

Update: 2022-07-04 14:00 GMT

Health Tips: నేరేడు గింజల పొడితో మధుమేహానికి చెక్.. ఎలాగంటే..?

Health Tips: ఈ కాలంలో నేరేడు పండ్లు బాగా దొరుకుతాయి. దీనివల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు కలుగుతాయి. ప్రాచీన కాలం నుంచి నేరేడు పళ్లని ఆయుర్వేదంలో ఉపయోగిస్తున్నారు. ఇవి మధుమేహాన్ని నియంత్రించడంలో సహాయపడుతాయి. నేరేడు గింజల పొడి రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడుతుంది. మీరు నేరేడు పళ్లు తింటే దాని గింజలను విసిరేయకండి. వాటిని ఎండబెట్టి పొడి చేయండి. ఈ పొడిని తీసుకోవడం వల్ల మధుమేహానికి సంబంధించిన అనేక సమస్యలు తొలగిపోతాయి. అయితే ఆ పొడి ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం.

ఈ సీజన్‌లో నేరేడు పళ్లని తింటే దాని గింజలను కడిగి ఉంచుకోవాలి. ఇప్పుడు వీటిని ఎండలో ఆరబెట్టి పొడి చేసుకోవాలి. మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఈ పొడి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. నేరేడు విత్తనాలలో జంబోలిన్, జంబోసిన్ అనే పదార్థాలు ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర విడుదలను నెమ్మదిస్తాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులు భోజనానికి ముందు ఈ పొడిని తీసుకోవాలి.

దీనికోసం ముందుగా నేరేడు గింజలను కడగాలి. ఇప్పుడు ఈ విత్తనాలను పొడి గుడ్డపై ఉంచి 3-4 రోజులు ఎండలో ఆరబెట్టాలి. విత్తనాలు ఎండిపోయి బరువు తక్కువగా ఉన్నట్లు అనిపించినప్పుడు పై నుంచి సన్నని చర్మాన్ని తొలగించాలి. ఇప్పుడు ఈ గింజలను మిక్సీలో వేసి పట్టాలి. తర్వాత ఈ పొడిని ఉదయాన్నే ఖాళీ కడుపుతో పాలతో తీసుకోవాలి. ఈ పొడిని రోజూ తింటే రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది. నేరేడు గింజలు కడుపు సంబంధిత సమస్యలను తొలగిస్తాయి.

Also Read

Health Tips: పురుషులు నేరేడు పళ్లని తప్పకుండా తినాలి.. ఎందుకంటే..?


Tags:    

Similar News