Health Tips:బట్టతల రావొద్దంటే ఈ పదార్థాలని అస్సలు తినకండి..!

Health Tips:బట్టతల రావొద్దంటే ఈ పదార్థాలని అస్సలు తినకండి..!

Update: 2022-07-10 13:30 GMT

Health Tips:బట్టతల రావొద్దంటే ఈ పదార్థాలని అస్సలు తినకండి..!

Health Tips: పూర్వకాలం బట్టతలని వృద్ధాప్యానికి చిహ్నంగా భావించేవారు. కానీ ప్రస్తుతం 25 నుంచి 30 సంవత్సరాల యువతకి కూడా బట్టతల వస్తోంది. చాలా మంది పెళ్లికి ముందే జుట్టును కోల్పోతున్నారు. ఆపై చాలా ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని సందర్భాల్లో ఇది జన్యుపరమైన కారణాల వల్ల జరుగుతుంది. కానీ చాలా సందర్భాలలో ఇది అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల వల్ల వస్తోంది. యువత కొన్ని పదార్థాలు తినడం వల్ల జుట్టు బాగా రాలిపోతుంది. అవేంటో తెలుసుకుందాం.

1. షుగర్

షుగర్ తీసుకోవడం వల్ల జుట్టు త్వరగా రాలడం మొదలవుతుందని తెలిస్తే ఆశ్చర్యపోతారు. తీపి పదార్ధాలను తక్కువగా తింటే ఆరోగ్యానికి మంచిది.

2. జంక్, ఫాస్ట్ ఫుడ్స్

మార్కెట్లలో దొరికే జంక్, ఫాస్ట్ ఫుడ్స్ ఆరోగ్యాన్ని పూర్తిగా పాడు చేస్తాయి. ఇందులో ఉండే శాచ్యురేటెడ్ ఫ్యాట్ బరువును పెంచడమే కాకుండా జుట్టుకు చాలా నష్టం కలిగిస్తుంది. ఇందులో ఉండే డిహెచ్‌టి అనే ఆండ్రోజెన్ బట్టతలని పెంచి, వెంట్రుకలని మృదువుగా మార్చుతుంది. దీని కారణంగా వెంట్రుకల కుదుళ్లు మూసుకుపోవడం ప్రారంభిస్తాయి. ఇది జుట్టు పెరుగుదలలో సమస్యలను కలిగిస్తుంది.

3. కలుషితమైన చేపలు

చేపలు తినడం వల్ల శరీరానికి కాల్షియం వంటి ముఖ్యమైన పోషకాలు లభిస్తాయి. కానీ కలుషితమైన చేపలను తినడం వల్ల జుట్టు రాలుతుంది. ఎందుకంటే ఇందులో పాదరసం ఉంటుంది. అందుకే చేపలు కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

4. ఆల్కహాల్

యువతలో ఆల్కహాల్ వ్యసనం ఎక్కువగా ఉంటోంది. దీని ప్రభావం జుట్టుపై పడుతోంది. ఎందుకంటే జుట్టు కెరాటిన్ అనే ప్రొటీన్‌తో తయారవుతుంది. ఆల్కహాల్ దీనిపై చెడు ప్రభావాన్ని చూపుతోంది. ఇలా చేయడం వల్ల జుట్టు బలహీనపడటమే కాకుండా మెరుపును కోల్పోతుంది.

5. పచ్చి గుడ్డులోని తెల్లసొన

కోడిగుడ్డు తినడం వల్ల ప్రొటీన్లు, నేచురల్ ఫ్యాట్ లభిస్తాయనడంలో సందేహం లేదు. కొంతమంది జుట్టు పెరగడానికి తలకు రాసుకుంటారు కానీ పొరపాటున పచ్చిగా తినవద్దు. ఇది కెరాటిన్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. ఇది జుట్టుపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది.

Tags:    

Similar News