Milk Check Tips: మీరు తాగే పాలు స్వచ్ఛమైనవేనా.. కల్తీపాలను ఇలా కనిపెట్టండి..!

Milk Chek Tips: నేటి కాలంలో తినే తిండి నుంచి తాగే నీటివరకు అన్నీ కల్తీ చేస్తున్నారు. మార్కెట్‌లో ఏది కొనాలన్నా భయమేస్తోంది.

Update: 2024-03-22 09:30 GMT

Milk Check Tips: మీరు తాగే పాలు స్వచ్ఛమైనవేనా.. కల్తీపాలను ఇలా కనిపెట్టండి..!

Milk Check Tips: నేటి కాలంలో తినే తిండి నుంచి తాగే నీటివరకు అన్నీ కల్తీ చేస్తున్నారు. మార్కెట్‌లో ఏది కొనాలన్నా భయమేస్తోంది. ఎందుకంటే అది నిజమైందా నకిలీదా తెలియడం లేదు. చివరకు చిన్నపిల్లల ఆహారపదార్థాలను కూడా కల్తీ చేస్తున్నారు. కొందరైతే డబ్బులకు ఆశపడి పాలను కూడా కల్తీ చేస్తున్నారు. వీటిని ఉపయోగించడం వల్ల అనారోగ్యానికి గురై ఆస్పత్రుల చుట్టు తిరగాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. యూరియా, హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌ వంటి వాటితో కల్తీ పాలు తయారు చేసి ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు. అందుకే మనం వినియోగించే పాలు స్వచ్ఛమైనవా.. కావా.. అనే విషయాన్ని తెలుసుకోవాలి.

పాలను వేడి చేయడం వల్ల అవి కల్తీ పాలా.. స్వచ్ఛమైన పాలా అనేది తెలుసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. పాలను వేడి చేసినప్పుడు అవి ఆవిరయ్యే తీరు ఆధారంగా వాటిలో ఎంతవరకు నీళ్లు, యూరియా కలిసిందో తెలిసిపోతుందంటున్నారు. స్వచ్ఛమైన పాలను వేడి చేసినప్పుడు పాల మధ్యలో బుడగలా వస్తుంది. అక్కడే మరుగుతున్నట్లుగా కనిపిస్తుంది.

అదే కల్తీ పాలను వేడి చేసినప్పుడు ఈ ప్రక్రియ స్థిరంగా ఉండదు. పాత్ర అంచుల వరకు పాలు మరుగుతాయి. పాలల్లో నీళ్లు ఎంత కలిపారన్నదాన్ని బట్టి ఇది మారుతూ ఉంటుంది. యూరియాతో కల్తీ అయ్యి ఉంటే ఆ పాలు ఆవిరి కావు. పాత్ర అంచుకు చుక్కల్లా అంటుకుంటాయి. పాలల్లో 30 శాతం కంటే ఎక్కువ నీరు కలిపినా 0.4 శాతం యూరియా కలిసినా ఈ విధానం ద్వారా గుర్తించవచ్చు.

Tags:    

Similar News