Red Wine: గుండెకు మంచిదని రెడ్ వైన్ ఎక్కువగా తాగుతున్నారా?
Red wine: ఈ మధ్యకాలంలో చాలామంది రెడ్ వైన్ వెనకాల పడుతున్నారు. అయితే దీనికి కారణం రెడ్ వైన్ అనేది చెడు కాదు.. ఆరోగ్యానికి మంచిది.
Red Wine: గుండెకు మంచిదని రెడ్ వైన్ ఎక్కువగా తాగుతున్నారా?
Red wine: ఈ మధ్యకాలంలో చాలామంది రెడ్ వైన్ వెనకాల పడుతున్నారు. అయితే దీనికి కారణం రెడ్ వైన్ అనేది చెడు కాదు.. ఆరోగ్యానికి మంచిది. అన్నింటికంటే ముఖ్యంగా గుండెకు రెడ్ వైన్ చాలా మంచిదని చెబుతుంటారు. అంతేకాదు నువ్వు కూడా తాగొచ్చనే సలహా కూడా ఇస్తుంటారు. కానీ రెడ్ వైన్ నిజంగా గుండెకు మంచి చేస్తుందా? అంటే అసలు కాదు అని కొంతమంది డాక్టర్లు చెబుతున్నారు. ఇంకా ఏమన్నారంటే...
వైన్‌లో చాలా రకాలు ఉంటాయి. అందులో ఒకటి రెడ్ వైన్. ముదురు రంగు ద్రాక్షపండ్లను దీన్ని తయారుచేస్తారు. ముఖ్యంగా ద్రాక్షతొక్కలను కూడా ఈ వైన్‌లో ఉపయోగిస్తారు. అదే దీని స్పెషాలిటీ. ద్రాక్షరసం, ఈస్ట్, ద్రాక్ష తొక్కలతో కలిపి, దాని పులియబెట్టి రెడ్‌వైన్‌ని తయారుచేస్తారు. ఈ రెడ్ వైన్ డిఫరెంట్ రంగులో ఉండడానికి, రుచికరంగా ఉండడానికి కారణం ఆ ద్రాక్ష తొక్కలే. అయితే రెడ్ వైన్ తాగడం వల్ల ఆరోగ్యానికి మంచిదేనని చాలామంది చెబుతుంటారు. ముఖ్యంగా గుండెకు రెడ్ వైన్ మంచిచేస్తుందని అంటారు. కానీ ఇందులో ఎంతమాత్రం నిజం లేదని కొంతమంది డాక్టర్లు చెబుతున్నారు.
రెడ్ వైన్‌లో ఏముంటాయి?
రెడ్ వైన్‌లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. దీనివల్లనే రెడ్ వైన్ తాగడం మంచిదని కొందరు చెబుతారు. ఇది గుండెను పదిలంగా ఉంచుదని, కణాలను సెట్ చేస్తుందని చెబుతారు. అలాగే ఇందులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీలు కూడా శరీరాన్ని ఆరోగ్యం ఉంచుతాయని అంటారు. అదేవిధంగా ఇందులో ఉండే పాలీ ఫెన్సాల్స్, ముఖ్యంగా రెస్వెరాట్రాల్, గుండె జబ్బులను తగ్గిస్తాయని అంటారు.
ఎంత వరకు తాగాలి?
చాలామంది రెడ్ వైన్‌లో అన్నీ మంచి గుణాలే ఉన్నాయి. కాబట్టి ప్రతిరోజూ తీసుకోవాలని చెబుతుంటారు. ఇది ఎంత మాత్రం నిజం కాదు. రెడ్ వైన్ మితంగా తాగడమే మేలు. లేదంటే మొత్తానికి మానేసినా మంచిదే. లేదు కచ్చితంగా కొంతైనా తాగుతాం అనేవాళ్లు వారానికి ఒకసారి కొంచెం తీసుకోవడం మంచిది. ఎందుకంటే రెడ్ వైన్ తాగడం వల్ల శరీరానికి ఎటువంటి ఉపయోగం లేదని కొందరు డాక్టర్లు చెబుతున్నారు.
గుండెకు మంచిదేనా?
రెడ్ వైన్ గుండెకు మంచిదని చాలామంది ప్రతిరోజూ రెడ్ వైన్‌ను తాగేస్తున్నారు. కానీ ఇది ఎంతమాత్రం ఆరోగ్యానికి మంచిది కాదు. ముఖ్యంగా గుండెకు , రెడ్ వైన్‌తో సంబంధం లేదని కొందరు డాక్టర్లు చెబుతున్నారు. ఏదైనా మితంగా తాగడం మంచిదని, గుండెకు మేలు చేస్తుంది కదా అని ఎక్కువగా తాగేస్తే లేని పోని ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవలసి వస్తుందని అంటున్నారు.