Raw Milk: పచ్చిపాలు ఆరోగ్యానికి మంచివా చెడ్డవా..!

Raw Milk: పాలను సంపూర్ణ ఆహారంగా పరిగణిస్తారు. ఎందుకంటే దాదాపు అన్ని రకాల పోషకాలు ఇందులో ఉంటాయి.

Update: 2022-05-21 09:30 GMT

Raw Milk: పచ్చిపాలు ఆరోగ్యానికి మంచివా చెడ్డవా..!

Raw Milk: పాలను సంపూర్ణ ఆహారంగా పరిగణిస్తారు. ఎందుకంటే దాదాపు అన్ని రకాల పోషకాలు ఇందులో ఉంటాయి. అందుకే చాలా మంది ఆరోగ్య నిపుణులు మంచి ఆరోగ్యం కోసం పాలు తాగాలని సూచిస్తారు. పాలని కొంతమంది నేరుగా తాగుతారు మరికొంతమంది పాల ఉత్పత్తుల ద్వారా ప్రయోజనం పొందుతారు. పచ్చి పాలు తాగాలా లేదా వేడి చేసి తాగాలా అనే దానిపై చాలా చర్చలు నడుస్తున్నాయి. వాస్తవానికి ఈ రోజు ఈ రెండింటి మధ్య తేడాల గురించి తెలుసుకుందాం.

పచ్చి పాలు తాగడం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుందనేది నిజం. ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ అమెరికాస్ హెల్త్ ప్రొటెక్షన్ ఏజెన్సీ ప్రకారం.. పచ్చి పాలలో ఎస్చెరిచియా కోలా, లిస్టేరియా, సాల్మోనెల్లా మొదలైన అనేక హానికరమైన బ్యాక్టీరియా ఉంటుంది. ఎవరైనా పచ్చి పాలు తాగడం ద్వారా ఫుడ్ పాయిజనింగ్ సమస్యని ఎదుర్కోవచ్చు. పచ్చి పాలలో ఉండే బ్యాక్టీరియా మన శరీరానికి హాని కలిగిస్తుంది. ఇది డయేరియా, ఆర్థరైటిస్, డీహైడ్రేషన్ వంటి సమస్యలను కలిగిస్తుంది. దీని వినియోగం శరీరంలోని యాసిడ్ స్థాయిని పెంచుతుంది. ఇది ఆరోగ్యానికి మంచిది కాదు.

పచ్చి పాలు తాగడం హానికరం ఎందుకంటే పశువుల పాలను తీస్తున్నప్పుడు పొదుగు శుభ్రంగా ఉండకపోవచ్చు. అంతే కాకుండా శుభ్రమైన చేతులు, శుభ్రమైన పాత్రలు ఉపయోగించకపోతే పాలలో మురికి చేరుతుంది. అందుకే మనం పాలు మరిగించిన తర్వాత తాగితేనే మంచిది. తద్వారా అందులో ఉన్న బ్యాక్టీరియా చనిపోతుంది.

Tags:    

Similar News