Milk Health Risks : పాల వెనుక దాగున్న చేదు నిజం..అమృతం అనుకుంటే అనారోగ్యం గ్యారెంటీ
Milk Health Risks : పాలు సంపూర్ణ ఆహారం అని, ఎముకల బలానికి ఎంతో మేలు చేస్తుందని మనందరికీ తెలుసు. చిన్నప్పటి నుంచి పాలు తాగితే శక్తి వస్తుందని పెద్దలు చెబుతుంటారు.
Milk Health Risks : పాల వెనుక దాగున్న చేదు నిజం..అమృతం అనుకుంటే అనారోగ్యం గ్యారెంటీ
Milk Health Risks : పాలు సంపూర్ణ ఆహారం అని, ఎముకల బలానికి ఎంతో మేలు చేస్తుందని మనందరికీ తెలుసు. చిన్నప్పటి నుంచి పాలు తాగితే శక్తి వస్తుందని పెద్దలు చెబుతుంటారు. కానీ ప్రస్తుత కాలంలో మారుతున్న జీవనశైలి, ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా పాలు అందరికీ అమృతం కాకపోవచ్చు. కొంతమందికి పాలు తాగడం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ జరుగుతోందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అసలు పాలు ఎవరికి పడవు? ఎందుకు తాగకూడదు? అనే ఆసక్తికర విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
పాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయనేది ఎంత నిజమో, అవి అందరి శరీర తత్వానికి పడవు అనేది కూడా అంతే నిజం. దీనికి ప్రధాన కారణం లాక్టోస్ ఇంటాలరెన్స్. మన శరీరంలో పాలను జీర్ణం చేయడానికి లాక్టేజ్ అనే ఎంజైమ్ అవసరం. కొంతమందిలో ఈ ఎంజైమ్ తక్కువగా ఉండటం వల్ల పాలు తాగగానే కడుపు ఉబ్బరం, గ్యాస్, కడుపు నొప్పి లేదా విరేచనాలు వంటి సమస్యలు తలెత్తుతాయి.
ఎవరెవరు పాలకు దూరంగా ఉండాలి?
జీర్ణక్రియ సమస్యలు ఉన్నవారు పాలు తాగకపోవడమే మంచిది. పాలు తాగిన తర్వాత కడుపులో అసౌకర్యంగా అనిపిస్తే అది మీ శరీరానికి సరిపడటం లేదని అర్థం. అలాగే, శ్వాసకోశ సమస్యలు లేదా తరచుగా జలుబు, కఫం సమస్యతో బాధపడేవారు పాలకు దూరంగా ఉండాలి. పాలు తాగడం వల్ల కఫం పెరిగి దగ్గు, ఉబ్బసం వంటి సమస్యలు తీవ్రమయ్యే అవకాశం ఉంది. చర్మ సంబంధిత సమస్యలు ఎక్కువగా ఉన్నవారు కూడా పాలు తాగడం తగ్గించాలి. పాలలోని కొన్ని హార్మోన్లు చర్మాన్ని మరింత జిడ్డుగా మార్చి మొడవలను పెంచుతాయి.
ప్రత్యామ్నాయాలు ఏంటి?
పాలు పడని వారు క్యాల్షియం కోసం చింతించాల్సిన అవసరం లేదు. పాల కంటే సులభంగా జీర్ణమయ్యే పెరుగు, మజ్జిగ లేదా పల్చటి నెయ్యిని ఆహారంలో చేర్చుకోవచ్చు. అలాగే ఇప్పుడు మార్కెట్లో లాక్టోస్ ఫ్రీ పాలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఒకవేళ మీరు పాలు తాగిన ప్రతిసారి ఏదో ఒక ఆరోగ్య సమస్యను ఎదుర్కొంటుంటే, మొండిగా తాగడం మానేసి వెంటనే ఒక పోషకాహార నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. పాలు తాగడం మంచిదే అయినా, అది మీ శరీరానికి నప్పుతుందో లేదో చూసుకోవడం అంతకంటే ముఖ్యం.