Kiwi Fruit: నిద్రలేమి సమస్య వేధిస్తోందా? అయితే ఈ పండును రోజూ తినండి

Kiwi Fruit: నిద్రలేమి సమస్య వేధిస్తోందా? అయితే ఈ పండును రోజూ తినండి

Update: 2025-08-15 14:15 GMT

Kiwi Fruit: నిద్రలేమి సమస్య వేధిస్తోందా? అయితే ఈ పండును రోజూ తినండి

Kiwi Fruit: కివీ పండు గురించి తెలియనివారుండరు. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కాస్త పుల్లగా ఉన్నా కూడా, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాల వల్ల దీనికి మార్కెట్‌లో ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. ప్రతిరోజూ ఒక కివీ పండు తింటే జలుబు, ఫ్లూ వంటి సమస్యల నుంచి రక్షణ పొందవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఈ పండు తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి? ఏయే ఆరోగ్య సమస్యలకు ఇది మంచిదో ఈ కథనంలో తెలుసుకుందాం.

జీర్ణక్రియకు తోడ్పడుతుంది

ఫైబర్ ఎక్కువగా ఉండే కివీ పండు జీర్ణ వ్యవస్థకు చాలా మంచిది. కివీలో ఉండే ఆక్టినిడిన్ అనే ఎంజైమ్ ప్రొటీన్ల జీర్ణక్రియకు సహాయపడుతుంది. కాబట్టి ఇది కడుపు సంబంధిత సమస్యలను తగ్గించడానికి తోడ్పడుతుంది.

గుండె ఆరోగ్యానికి చాలా మంచిది

కివీ పండ్లలో పొటాషియం, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అంతేకాకుండా, పొటాషియం రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. తద్వారా గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. కివీలో ఉండే యాంటీఆక్సిడెంట్లు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి.

చర్మ సౌందర్యాన్ని పెంచుతుంది

కివీ పండ్లలో విటమిన్ సి, విటమిన్ ఇ వంటి యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి మన చర్మానికి చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. ఈ పండు చర్మంలో ముడతలను తగ్గించి, చర్మం బిగుతుగా ఉండటానికి సహాయపడుతుంది. కివీ తినడం వల్ల వృద్ధాప్య ఛాయలు కూడా తగ్గుతాయి.

నిద్రలేమి నుంచి ఉపశమనం

కివీ పండులో సెరోటోనిన్ అనే రసాయనం ఉంటుంది. ఇది నిద్ర నాణ్యతను మెరుగుపరచడానికి సహాయపడుతుంది. ప్రతిరోజూ పడుకోవడానికి ముందు ఒక కివీ పండు తింటే మంచి నిద్ర పడుతుందని చెబుతారు. నిద్రలేమి సమస్యతో బాధపడేవారికి మంచి నిద్ర కోసం రోజుకు ఒక కివీ పండు తినమని సలహా ఇస్తారు.

కంటి ఆరోగ్యానికి మేలు

కివీ పండ్లలో ల్యూటిన్ , జియాక్సంతిన్ వంటి యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి కంటి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ పండ్లు కళ్లను కాంతి నుంచి, వయస్సు సంబంధిత కంటి సమస్యల నుంచి రక్షించడానికి సహాయపడతాయి.

Tags:    

Similar News