చేపలకు మొటిమలకు సంబంధం ఉందని తెలుసా.?

చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చేపలను రెగ్యులర్‌గా ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఆరోగ్యం మెరుగ్గా ఉంటుందని చెబుతుంటారు

Update: 2025-01-18 15:00 GMT

చేపలకు మొటిమలకు సంబంధం ఉందని తెలుసా.?

చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చేపలను రెగ్యులర్‌గా ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఆరోగ్యం మెరుగ్గా ఉంటుందని చెబుతుంటారు. ముఖ్యంగా ఇందులో ఆరోగ్యకరమైన కొవ్వులు గుండె ఆరోగ్యాన్ని కాపాడుతాయి. బరువు తగ్గాలనుకునే వారికి కూడా చేపలు క్రీయాశీలకంగా పనిచేస్తాయి. అయితే చేపల మొటిమలను కూడా తగ్గిస్తాయని మీకు తెలుసా.?

చేపల్లోని ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌ సాల్మన్, సార్‌డైన్స్‌ వంటి చేపలు మొటిమల నివారణకు, త్వరగా తగ్గటానికి ఉపయోగపడతాయి. మొటిమలు ఎక్కువగా ఉన్న వారిని పరిశీలించగా వీరిలో సుమారు 98 శాతం మందిలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌ తక్కువగా ఉన్నట్లు తేలింది. ఇలాంటి వారికి కొవ్వు ఆమ్లాలు ఎక్కువగా ఉండే ఆహారం, మాత్రలను ఇవ్వగా సత్ఫలితం కనిపించినట్లు అధ్యయనంలో తేలింది.

అంతేకాకుండా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌ శరీరంలో వాపును తగ్గిస్తాయని, చర్మంలో నూనె ఉత్పత్తిని నియంత్రిస్తాయని పరిశోధకులు తెలిపారు. ఇవి వాపు ప్రక్రియను ప్రేరేపించే రసాయనాలను నిరోధించటం ద్వారా మొటిమలు తగ్గేలా చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. అయితే కొందరు పరిశోధకుల అభిప్రాయం ప్రకారం ఇతరులతో పోల్చకపోవటం వల్ల మొటిమలు తగ్గటమనేది ఆహారం, పాల పదార్థాలు తగ్గించటం, ఒమేగా 3 ట్యాబ్లెట్స్‌, ఇతర పద్ధతుల్లో ఏవి ప్రభావం చూపిస్తున్నాయో తెలియటం లేదంటున్నారు.

అయితే చేపలతో పాటు గింజ పప్పుల్లో కూడా వాపును తగ్గించే గుణాలు ఉన్నట్లు పరిశోధకులు చెబుతున్నారు. ఇవి దురద, మొటిమల వంటి చర్మ సమస్యలు తగ్గడానికి సహాయపడుతున్నట్లు పరిశోధనల్లో తేలింది. ఆలివ్‌ నూనె చర్మాన్ని మృదువుగా మార్చడంలో ఉపయోగపడుతుందని, రక్తంలో త్వరగా గ్లూకోజ్‌ కలవకుండా చేసే పదార్థాలు సైతం చర్మానికి ఎంతో మేలు చేస్తాయని పరిశోధకులు చెబుతున్నారు.

Tags:    

Similar News