యువత ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తున్న లైఫ్ స్టైల్.. కొత్త జబ్బులను తెచ్చి పెడుతున్న..

Youngsters: సౌత్ ఏషియన్ కంట్రీస్‌లో డయాబెటిస్, ఒబేసిటి బాధితులు నానాటికీ పెరిగిపోతున్నారు.

Update: 2021-11-22 09:48 GMT

యువత ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తున్న లైఫ్ స్టైల్.. కొత్త జబ్బులను తెచ్చి పెడుతున్న..

Youngsters: సౌత్ ఏషియన్ కంట్రీస్‌లో డయాబెటిస్, ఒబేసిటి బాధితులు నానాటికీ పెరిగిపోతున్నారు. ఎక్కువ శాతం యువత వీటి బారిన పడుతుండటం ఆందోళన కలిగిస్తుంది. కొత్త ఆహారపు అలవాట్లు, నిద్ర లేమి లాంటి సమస్యలు యువతను మరింత ప్రభావితం చేస్తున్నాయి. ఈ మధ్య కాలంలో యువత డయాబెటిస్, ఒబేసిటి బారిన పడటానికి గల కారణాలేంటో ఓ సారి చుద్దాం.

మారుతున్న లైఫ్ స్టైల్, ప్రస్తుత ఫుడ్ హ్యాబిట్స్ యువత ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తున్నాయి. టైంకి తినకపోవడం, జంక్ ఫుడ్ తినడం లాంటి అలవాట్లు కొత్తరకం జబ్బులకు దారి తీస్తున్నాయి. 16 ఏళ్ల వయసులోనే అధిక బరువుతో స్థూలకాయం బారిన పడుతున్నారు. అధిక బరువుతో కేవలం ఊబకాయం మాత్రమే కాకుండా కాలేయ సమస్యలు, బీపీ, క్యాన్సర్, జీర్ణక్రియ దెబ్బ తినడం వంటి సమస్యలు వస్తున్నాయి.

అసమానత అలవాట్లతో యువత అనేక రోగాల బారిన పడుతుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా డయాబెటిస్, ఒబేసిటి బాధితులు అంతకంతకూ పెరిగిపోతున్నారని అంటున్నారు. ఈ ఓవర్ వెయిట్ వల్ల ఫ్యూచర్‌లో పలు డీసీజెస్ అటాక్ చేసే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఆరోగ్యంగా ఉండాలంటే హెల్తీ ఫుడ్ తీసుకోవాలని వైద్యులు తేల్చి చెబుతున్నారు. సో బీ కేర్ ఫుల్ యంగ్ స్టార్స్.

Tags:    

Similar News