Health Tips: ఎండాకాలం ఈ ఆహారాలు వేడి నుంచి కాపాడుతాయి.. అవేంటంటే..!

Health Tips: వాతావరణం మారినప్పుడల్లా వైరస్‌లు, బ్యాక్టీరియాల ఇన్‌ఫెక్షన్‌ పెరుగుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

Update: 2022-03-26 12:30 GMT

Health Tips: ఎండాకాలం ఈ ఆహారాలు వేడి నుంచి కాపాడుతాయి.. అవేంటంటే..!

Health Tips: వాతావరణం మారినప్పుడల్లా వైరస్‌లు, బ్యాక్టీరియాల ఇన్‌ఫెక్షన్‌ పెరుగుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఎండాకాలం చాలామంది డీ హైడ్రేషన్ సమస్యతో బాధపడుతుంటారు. ఇలాంటి వారు ఆహారంలో కొన్ని ప్రత్యేక వాటిని చేర్చుకోవాలి. మసాలా, జిడ్డైన వస్తువుల వాడకాన్ని తగ్గించాలి. అలాగే నీరు పుష్కలంగా తాగాలి. తద్వారా శరీరం నిరంతరం హైడ్రేటెడ్‌గా ఉంటుంది. నీరు తాగడం వల్ల మన శరీరానికి హాని కలిగించే ప్రమాదకరమైన టాక్సిన్స్ బయటకు వెళ్లిపోతాయి.

ఉదర సమస్యలతో ఇబ్బంది పడుతుంటే వేసవిలో చల్లటి పాలు తాగాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. కానీ చల్లని పాలు అంటే ఫ్రిజ్ లో ఉంచిన పాలు తాగాలి అని కాదు. పాలను చల్లార్చి మామూలుగానే తాగాలి. ఇలా చేయడం వల్ల పొట్ట చల్లబడి మంట, ఎసిడిటీ వంటి సమస్యలు తీరిపోతాయి. ఏడాది పొడవునా మజ్జిగను ఎప్పుడైనా తాగవచ్చు. కానీ వేసవిలో దాని వినియోగం దివ్యౌషధంగా పరిగణిస్తారు. ఇది ఎసిడిటీతో పాటు ఇతర పొట్ట సమస్యలను దూరం చేస్తుంది. ఇందులో ఉండే సహజసిద్ధమైన బ్యాక్టీరియా కడుపులో అధిక మొత్తంలో యాసిడ్ ఏర్పడకుండా చేస్తుంది. దీని ద్వారా మీరు రోజంతా ఫిట్‌గా ఉంటారు.

పుచ్చకాయ సహజంగా నీటితో నిండి ఉంటుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ యాసిడ్ రిఫ్లక్స్ ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల ఆకలి, దాహం రెండూ తొలగిపోతాయి. ఎసిడిటీ, గ్యాస్, కడుపు నొప్పి వంటి సమస్యలను ఎదుర్కోవడంలో బెస్ట్ రెమెడీగా చెప్పవచ్చు. అలాగే కొబ్బరి నీళ్లలో శరీరాన్ని డిటాక్సిఫై చేసే గుణాలు ఉంటాయి. ఇది పూర్తి పోషకాహారాన్ని మాత్రమే కాకుండా శరీరంలో నీటి కొరతను తొలగిస్తుంది. దీని వినియోగం కారణంగా శరీరం లోపల నుంచి చల్లగా ఉంటుంది. యాసిడ్ ఏర్పడటం కంట్రోల్‌ అవుతుంది. కొబ్బరి నీళ్లలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది ఇది జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది.

Tags:    

Similar News